పిగ్మెంటేషన్ తగ్గిద్దామిలా
ABN, Publish Date - Jun 16 , 2025 | 05:34 AM
చాలా మంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య పిగ్మెంటేషన్ (మంగు మచ్చలు). ఈ మచ్చలను ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
చాలా మంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య పిగ్మెంటేషన్ (మంగు మచ్చలు). ఈ మచ్చలను ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును కలిపి మచ్చల మీద రాసి అరగంట సేపు తరువాత కలిగేయాలి.
పుదీనా ఆకులను రుబ్బి ఆ పేస్టును మచ్చల మీద రాయాలి. పావుగంట తరువాత కడిగేయాలి.
రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం టమాటా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మంగు మచ్చలపై రాసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
నారింజ తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుని అందులో కొన్ని పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని మచ్చలపై రాయాలి. ఆరిన తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.
బంగాళదుంపల రసాన్ని మచ్చల మీద రాసి అరగంట తరువాత కడిగేసుకోవాలి.
పసుపులో పాలు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. దీనిని మచ్చల మీద రాసి 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి.
వాడిన గ్రీన్ టీ బ్యాగులతో మచ్చల మీద రుద్దాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మచ్చలు తగ్గుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్, నీళ్లు సమపాళ్లలో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని దూదితో మచ్చల మీద అద్దాలి. 5 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ రెండుసార్లు ఇలా చేయాలి.
రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జును రాసుకుని, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 16 , 2025 | 05:34 AM