ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kids Room Design: పిల్లల గది ఇలా ఉండాలి..

ABN, Publish Date - May 19 , 2025 | 04:21 AM

పిల్లల అభిరుచులకు అనుగుణంగా గదిని రంగులనీ, వాల్‌ పేపర్లనీ ఉపయోగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. రాత్రిళ్లు మెరుస్తూ కనిపించే సీలింగ్‌ డెకర్‌ ద్వారా వారి ఊహాశక్తిని పెంపొందించవచ్చు.

పిల్లల ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా సౌకర్యవంతంగా ఉండేలా వారి గదిని తీర్చిదిద్దాలి. చిన్నారుల్లో సృజనాత్మకతను పెంచుతూ వాళ్లు ఆనందంగా గడిపేలా గదిని అలంకరించాలి. పిల్లల గదిని డిజైన్‌ చేసేటప్పుడు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకుందాం....

పిల్లల గదిలో గోడలకు ఒకే రంగు కాకుండా మూడు లేదా నాలుగు రంగులు ఉండేలా చూసుకోవాలి. గులాబీ, నీలం, పసుపు, ఆకుపచ్చ లాంటి ముదురు రంగులను ఎంచుకోవడం మంచిది.

గోడలకు వాల్‌ పేపర్లు అంటిస్తే గది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కార్టూన్‌ బొమ్మలు, పిల్లలకు ఇష్టమైన కథల్లోని పాత్రల బొమ్మలు అంటించవచ్చు. ఫ్లోరల్‌ లేదా జంగిల్‌ థీమ్‌తో ఉన్న వాల్‌ పేపర్లు కూడా బాగుంటాయి. వీటిని పిల్లల ఇష్టప్రకారం ఎంపిక చేయడం మంచిది. కొంతమంది పిల్లలకు ప్రపంచంలోని దేశాల గురించి తెలుసుకోవాలనీ, వివిధ ప్రదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటప్పుడు రంగురంగుల ప్రపంచ పటాన్ని వాల్‌ పేపర్‌గా ఏర్పాటు చేయాలి. సీలింగ్‌ మీద.... రాత్రిపూట మెరిసే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల బొమ్మలు అంటిస్తే పిల్లలు వాటిని చూస్తూ నిద్రపోతారు.


గది అంతటా వెలుగు ప్రసరించేలా ట్యూబ్‌లైట్‌ అమర్చాలి. చిన్న బెడ్‌ లైట్‌ కూడా ఉంటే మంచిది.

పిల్లల గదిలో సోఫా కమ్‌ బెడ్‌ను ఏర్పాటు చేస్తే అది రెండు విధాలుగా పనికివస్తుంది. దిండ్లకు కార్టూన్‌ బొమ్మలు లేదా మంచి కొటేషన్స్‌ ఉన్న గలీబులను తొడిగితే బాగుంటుంది. ఆకర్షణీయమైన డిజైన్లతో ఉన్న దుప్పట్లను పిల్లలకు అందుబాటులో ఉంచాలి. తెలుపు లేదా లేత రంగుల్లో ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.

పిల్లల గదిలో బుక్‌ షెల్ఫ్‌ తప్పనిసరిగా ఉండాలి. ఇందులో వాళ్లు ఆడుకునే బొమ్మలు, చదువుకునే పుస్తకాలు, కథల పుస్తకాలు లాంటివి సర్ది పెట్టాలి.

గదిలో ఓ పక్కగా స్డడీ టేబుల్‌, కుర్చీలను ఏర్పాటు చేయాలి. టేబుల్‌ మీద పెన్నులు, పెన్సిళ్లు, టేబుల్‌ లైట్‌, రైటింగ్‌ ప్యాడ్‌ సర్దాలి.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:36 AM