ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coconut Milk Recipes: కొబ్బరి పాలతో నోరూరేలా..

ABN, Publish Date - Aug 09 , 2025 | 02:33 AM

రాఖీ పండక్కి అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, బంధుమిత్రులు అందరూ ఒక చోట కలుసుకుంటూ ఉంటారు.

రాఖీ పండక్కి అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, బంధుమిత్రులు అందరూ ఒక చోట కలుసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఏవైనా స్పెషల్‌ వంటకాలు చేస్తే ఆ ఆనందం రెట్టింపవుతుంది. ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ సమయంలో పూర్తయ్యేవి అయితే ఇంకా బాగుంటుంది. కొబ్బరిపాలతో తయారుచేసే అలాంటి విభిన్న వంటకాలు మీకోసం...

కొబ్బరిపాల పలావ్‌

కావాల్సిన పదార్థాలు

బియ్యం- ఒక గ్లాసు, పచ్చి కొబ్బరి చిప్ప- ఒకటి, నెయ్యి- రెండు చెంచాలు, బిరియానీ ఆకు- ఒకటి, దాల్చిన చెక్క- చిన్న ముక్క, మిరియాలు- 15, లవంగాలు- మూడు, యాలకులు- రెండు, జీలకర్ర- అర చెంచా, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- ఆరు, జీడిపప్పు- కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, కేరట్‌ ముక్కలు- పావు కప్పు, ఆలుగడ్డ ముక్కలు- పావు కప్పు, బీన్స్‌ ముక్కలు- పావు కప్పు, ఉప్పు- రెండు చెంచాలు, తరిగిన కొత్తిమీర- కొద్దిగా, గరం మసాల పొడి- అర చెంచా

తయారీ విధానం

  • బియ్యాన్ని కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి ఉంచాలి. కొబ్బరి చిప్పను చిన్న ముక్కలుగా కోయాలి. మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. స్టయినర్‌ సహాయంతో ఈ మిశ్రమం నుంచి కొబ్బరి పాలను గిన్నెలోకి వడబోయాలి.

  • స్టవ్‌ మీద కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. తరవాత బిరియానీ ఆకు, కరివేపాకు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కేరట్‌ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, బీన్స్‌ ముక్కలు, కొత్తిమీర, గరం మసాల పొడి వేసి మరో అయిదు నిమిషాలు వేయించాలి. తరవాత ఆ మిశ్రమంలో నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత రెండు గ్లాసుల కొబ్బరిపాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. కుక్కర్‌కు మూతపెట్టి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పాల పలావ్‌ను ఏదైనా గ్రేవీ కర్రీ లేదా రైతాతో సర్వ్‌ చేసుకోవచ్చు.

చిట్కాలు

  • ఈ పలావ్‌లో క్యాలీ ఫ్లవర్‌, క్యాప్సికమ్‌ ముక్కలు కూడా వేసుకోవచ్చు.

  • కొబ్బరి పాలను చిక్కగా తయారు చేసుకుంటే పలావ్‌ రుచిగా ఉంటుంది.

కొబ్బరిపాల జున్ను

చీకావాల్సిన పదార్థాలు

పచ్చి కొబ్బరి ముక్కలు- ఒకటిన్నర కప్పులు, నీళ్లు- రెండు కప్పులు, కార్న్‌ఫ్లోర్‌- నాలుగు చెంచాలు, బెల్లం- అర కప్పు, యాలకులు- మూడు, మిరియాల పొడి- అర చెంచా

తయారీ విధానం

  • మిక్సీలో పచ్చి కొబ్బరి ముక్కలు, నీళ్లు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమం నుంచి కొబ్బరి పాలను స్టయినర్‌ సహాయంతో గిన్నెలోకి వడబోయాలి. మరో చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి అందులో కొన్ని కొబ్బరి పాలు పోసి ఉండలు లేకుండా జారుగా కలపాలి. ఈ కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని కొబ్బరిపాల గిన్నెలో పోసి బాగా కలపాలి. తరవాత అందులో యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ గిన్నె మీద మూత పెట్టాలి.

  • స్టవ్‌ మీద కుక్కర్‌ పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. తరవాత అందులో కొబ్బరి పాల గిన్నె ఉంచి కుక్కర్‌కు మూతపెట్టాలి. విజిల్‌ పెట్టకూడదు. అరగంటసేపు చిన్న మంట మీద ఉడికించాలి. తరవాత ఈ గిన్నెను బయటికి తీసి చల్లార్చాలి. ఇలా తయారుచేసుకున్న కొబ్బరిపాల జున్నును అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరవాత ముక్కలుగా కోసి సర్వ్‌ చేసుకోవాలి.

చిట్కాలు

  • ఇందులో జీడిపప్పు, బాదం పలుకులు వేస్తే రుచి మరింత పెరుగుతుంది.

  • కొబ్బరి ముక్కలకు వెనక ఉన్న నల్లని భాగాన్ని తీసివేస్తే జున్ను ముక్కలు చూడడానికి బాగుంటాయి.

Updated Date - Aug 09 , 2025 | 02:33 AM