ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dr Mani Pavitra: వారి ప్రశ్నలకు సమాధానాలివే

ABN, Publish Date - May 12 , 2025 | 05:47 AM

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మణి పవిత్ర 'క్రియేటర్ వెర్స్' ద్వారా సామాజిక మీడియా ద్వారా వ్యాపారాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో శిక్షణ ఇస్తున్నారు. ఇది వ్యాపారవేత్తలకు, నైపుణ్య కలిగిన వ్యక్తులకు ప్రపంచానికి తమ కస్టమర్ల ప్రశ్నలకు సమాధానాలను వీడియోల రూపంలో అందించేందుకు సహాయపడుతుంది.

ఈ సోషల్‌ మీడియా యుగంలో ఒకరి వద్ద ఉన్న ఉత్పత్తులను, సేవలను ప్రపంచం ముందు ఉంచటానికి ‘యూట్యూబ్‌’, ‘ఎక్స్‌’, ‘ఫేస్‌బుక్‌’, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ లాంటి అనేక సాధనాలు ఉన్నాయి. అయితే చాలా మందికి వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. అలాంటి వారి కోసం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మణి పవిత్ర - ‘క్రియేటర్‌ వెర్స్‌’ పేరిట ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

‘‘నేను వృత్తిరీత్యా డాక్టర్‌ని. కానీ ఐఎ్‌సబీలో కోర్సు చేసిన తర్వాత- ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తమ వ్యాపారం ఎలా పెంచుకోవాలనే విషయంపై సలహాలు ఇవ్వటం మొదలుపెట్టాను. కొన్ని సంస్థలకు సలహాదారుగా కూడా పనిచేస్తున్నా. నా పదేళ్ల అనుభవంలో అనేకమంది వ్యాపారవేత్తలు నా దగ్గరకు వస్తూ ఉండేవారు. వారికి తాము చేసే వ్యాపారం పట్ల చాలా స్పష్టత ఉంటుంది. అయితే దాన్ని ఎక్కువమంది దగ్గరకు ఎలా తీసుకువెళ్లాలో తెలియదు. గత ఐదేళ్లుగా మన దేశంలో సోషల్‌ మీడియా క్రియేటర్స్‌ సంఖ్య బాగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 2020లో మన దేశంలో సుమారు 10 లక్షల మంది ఉంటే - 2024 నాటికి వీరి సంఖ్య 40 లక్షలకు పెరిగింది. అయితే వీరిలో చాలామంది నిపుణులు కారు. చూడటానికి బావుంటారు కాబట్టి, వినోదం అందించగలరు కాబట్టి తాము వీడియోలు చేసి ఆన్‌లైన్‌లో పెడుతూ ఉంటారు. వీరితోపాటు డాక్టర్లు, ఔత్సాహిక వాణిజ్యవేత్తలు లాంటి వారు సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవచ్చనే ఆలోచనతో ‘క్రియేటర్స్‌ వెర్స్‌’ను ప్రారంభించాను.


రకరకాలుగా...

రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు ఇళ్లలో చిత్రీకరించటం కష్టం. బయటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. హఠాత్తుగా ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీడియోలో మనం ఎలా కనిపిస్తున్నామో కూడా మనకు తెలియదు. ఇలాంటి కష్టాలేవీ లేకుండా ‘క్రియేటర్స్‌ వర్స్‌’లో సుమారు 30 రూములు ఉన్నాయి. 60 దాకా బ్యాక్‌డ్రాప్స్‌ ఉన్నాయి. అంటే ఒకోచోట రకరకాలుగా వీడియోలు చేసుకోవచ్చు. దీని వల్ల బ్యాక్‌డ్రా్‌పల సమస్య తీరిపోతుంది. ఇక మిగిలింది స్ర్కిప్ట్‌. దీని కోసం మూడు రోజుల ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. ప్రతి వ్యాపారానికి కస్టమర్స్‌ ఉంటారు. వారికి అనేక ప్రశ్నలు ఉంటాయి. వ్యాపారం పెరుగుతున్న కొలది ఈ ప్రశ్నలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ చాలా సందర్భాలలో సమయాభావం వల్ల వినియోగదారుల ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేరు. అందువల్ల కస్టమర్లు వేసే ప్రశ్నలన్నింటినీ ఒకో చోట రాసుకొని రమ్మని చెబుతాం. ఈ ప్రశ్నలకు సమాధానాలను తయారుచేయటంలో మేము వారికి సహకరిస్తాం. అంటే వారి ప్రశ్నలకు వీడియోల ద్వారా సమాధానాలిస్తాం. మేము సహాయపడటమే కాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) నుంచి సాయం ఎలా తీసుకోవాలో నేర్పుతాం. చాలామందికి ఏఐ అనేది మన పని సులువు చేసే సాధనంగా మాత్రమే తెలుసు. కానీ దాన్ని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. ఈ విధంగా స్ర్కిప్ట్‌లు పూర్తయిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల్లో వేర్వేరు బ్యాక్‌డ్రాప్స్ లో సుమారు 100 వీడియోలు చేయిస్తాం. ఈ వీడియోలన్నింటినీ ఆ తర్వాతి 21 రోజుల్లో ఎడిట్‌ చేయించి, అప్‌లోడ్‌ చేసుకోవటానికి సిద్ధం చేయిస్తాం. అంటే రోజుకు ఒక వీడియో చొప్పున అప్‌లోడ్‌ చేసుకున్నా- మూడు నెలల పాటు ఎటువంటి సమస్య ఉండదు.


ఇలాంటి కథలెన్నో...

నా దగ్గరకు శిక్షణకు వచ్చే వారిలో డాక్టర్లు, వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేవారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు... ఇలా అనేక మంది ఉన్నారు. నా ఉద్దేశంలో ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంటుంది. ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యం ఉందనే సంగతి వారికి కూడా తెలియదు. ఇలాంటి ఒక ఉదాహరణ చెబుతాను. నా దగ్గర ఒకామె శిక్షణ పొందారు. ఆమె భర్త చనిపోయారు. ఆమె పిల్లవాడికి ముంబాయిలో సీటు వచ్చింది. దాంతో వాళ్లు హైదరాబాద్‌ నుంచి ముంబాయికి మకాం మార్చాల్సి వచ్చింది. ఆమెకు ముంబాయిలో ఎవరు తెలియదు. అందువల్ల ఆమె ఇంటి కోసం రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్స్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఉండేవారు. అలా తన అనుభవాలన్నింటినీ వీడియోల రూపంలో యూట్యూబ్‌లో పెట్టడం మొదలుపెట్టారు. ఈ వీడియోలు చూసి సమాచారం కోసం కొందరు ఆమెకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఇలా ఆమె సుమారు 100 వీడియోల దాకా చేశారు. గత వారం ఆమె ఒక ఏజెంట్‌ ద్వారా 3.5 కోట్ల విలువైన ఇంటిని అమ్మించారు. తనకు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసే సామర్థ్యం ఉందనే విషయం ఆమెకు కూడా తెలియదు. ఇలాంటి కథలెన్నో! మన చుట్టూ ఉన్న సమాజంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వీరందరూ తమ నైపుణ్యాలను ప్రపంచానికి తెలియజేయటానికి, ఎంతో కొంత డబ్బు అదనంగా సంపాదించుకోవటానికి సోషల్‌ మీడియా సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. వీటిని వాడుకోగలిగిన నాడు మరింత పురోగతిని సాధించగులుగుతాం.’’

Updated Date - May 12 , 2025 | 05:50 AM