Amaranth Recipes: తోటకూరతో విభిన్నంగా..!
ABN, Publish Date - Oct 04 , 2025 | 02:46 AM
తోటకూర ఆకులు పెద్దవి- పది, శనగ పిండి- ఒక కప్పు, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, అల్లం- వెల్లుల్లి పేస్టు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, వాము- అర చెంచా, నూనె- తగినంత..
తోటకూర బేసన్ రోల్స్
కావాల్సిన పదార్థాలు
తోటకూర ఆకులు పెద్దవి- పది, శనగ పిండి- ఒక కప్పు, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, అల్లం- వెల్లుల్లి పేస్టు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, వాము- అర చెంచా, నూనె- తగినంత
తయారీ విధానం
వెడల్పాటి గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం - వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, వాము వేసి బాగా కలపాలి. తరువాత ఆ పిండిలో నీళ్లు చిలకరిస్తూ పేస్టులా తయారుచేయాలి.
తోటకూర ఆకులను నీళ్లలో ముంచి తీయాలి. ఒక్కో ఆకు మీద శనగపిండి మిశ్రమాన్ని చెంచా సహాయంతో పలుచగా రాసి, దాన్ని చాపలా చుట్టి పళ్లెంలో పెట్టాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత అందులో తోటకూర రోల్స్ పరచాలి. ఒక్కో రోల్‌ను ఫోర్క్ సహాయంతో అన్ని వైపులకూ తిప్పుతూ దోరగా వేయించాలి. రోల్స్ ఎర్రగా వేగిన తరువాత పళ్లెంలోకి తీయాలి. ఈ తోటకూర - బేసన్ రోల్స్‌ను టమాటా సాస్‌తో సర్వ్ చేయవచ్చు.
Updated Date - Oct 04 , 2025 | 11:49 AM