CAR-T therapy: క్యాన్సర్ చికిత్సతో మతిమరుపు
ABN, Publish Date - May 20 , 2025 | 04:25 AM
క్యాన్సర్ చికిత్సలో సమర్థవంతమైన కార్-టి సెల్ థెరపీ, మెదడు పనితీరుపై ప్రభావం చూపే దుష్ప్రభావాలు కలిగి ఉండొచ్చని స్టాన్‌ఫోర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ఇందువల్ల శాస్త్రవేత్తలు మెదడు సామర్థ్యాన్ని పరిరక్షించే కొత్త చికిత్సా మార్గాలను పరిశోధిస్తున్నారు.
కార్-టి సెల్ థెరపీ ఫలప్రదమైన క్యాన్సర్ చికిత్స. అయితే ఈ చికిత్సతో మతిమరుపు, ఏకాగ్రతా లోపం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయని తాజాగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
రోగి సొంత టి సెల్స్‌ను మార్పుకు గురి చేయడం ద్వారా, క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేసే కార్-టి సెల్ చికిత్స ఎంతో సమర్థవంతమైనది. వేగంగా విజృంభించే తత్వం కలిగిన క్యాన్సర్ కొమ్ములు విరచడంలో ఈ చికిత్స అత్యంత సమర్థమైనదిగా పేరుపొందింది. అయితే ప్రతి కేన్సర్ చికిత్సకూ దుష్ప్రభావాలు ఉనట్టే, దీనికి కూడా మెదడు పనితీరును ప్రభావితం చేసే స్వభావం ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. మెదడు, చర్మం, రక్తం, ఎముక... ఇలా వేర్వేరు శరీరావయవాలకు క్యాన్సర్ సోకిన ఎలుకలపై చేపట్టిన చిట్టెలుకలను అధ్యయనం చేసినప్పుడు, కార్-టి చికిత్సకు ముందు, తర్వాత సదరు చిట్టెలుకలతో మెదడు సామర్థ్యం తగ్గిన సూచనలు కనిపించినట్టు పరిశోధకులు కనిపెట్టడం జరిగింది. అయితే కార్-టి చికిత్స ఎంతో సమర్థమైనది కాబట్టి ఈ చికిత్స ప్రభావం మెదడు పనితీరు మీద కనబరిచే శాశ్వత ప్రభావాలను అర్థం చేసుకోవడం ఎంతో కీలకం. కాబట్టి ప్రస్తుతం పరిశోధకులు, ఈ చికిత్సతో క్షీణించిన మెదడు పనితీరును తిరిగి సరిదిద్దగలిగే వ్యూహాత్మకమైన చికిత్సా ప్రత్యామ్నాయాలను కనిపెట్టడంతో పాటు, ఇలాంటి దుష్ప్రభావాలు తక్కువగా ఉండే భవిష్యత్తు చికిత్సా విధానాలను కూడా రూపొందించే పనికి పూనుకున్నారు.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 04:25 AM