చుడీదార్ చూడముచ్చటగా
ABN, Publish Date - Jun 11 , 2025 | 05:08 AM
అన్ని వయసుల మహిళలూ ధరించడానికి ఇష్టపడే డ్రస్.. చుడీదార్! ఇంపైన రంగులు, చూడచక్కని ప్రింట్లు, ఆకర్షణీయమైన చున్నీలు.. ఇన్ని హంగులు ఉంటాయి కాబట్టే చుడీదార్‌కు అంతటి ఆదరణ! తాజాగా...
ఫ్యాషన్
అన్ని వయసుల మహిళలూ ధరించడానికి ఇష్టపడే డ్రస్.. చుడీదార్! ఇంపైన రంగులు, చూడచక్కని ప్రింట్లు, ఆకర్షణీయమైన చున్నీలు.. ఇన్ని హంగులు ఉంటాయి కాబట్టే చుడీదార్‌కు అంతటి ఆదరణ! తాజాగా ఆధునికత ఉట్టిపడే పలు రకాల చుడీదార్లు ట్రెండ్ సృష్టిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని..
నెక్ పెద్దదిగా ఉంటే, మెడకు అంటుకుని ఉండే చోకర్ ధరించాలి. చిన్నదిగా ఉంటే, చాంద్‌బాలీ లాంటి ఝుంకాలు పెట్టుకోవాలి
మిక్స్ అండ్ మ్యాచ్ ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకోసం కాంట్రాస్ట్ రంగుల టాప్స్, బాటమ్స్ ఎంచుకోవాలి
రాజస్థాన్ జుత్తీలు, షోలాపూర్ చెప్పులు వినూత్నంగా కనిపిస్తాయి కాబట్టి చుడీదార్‌తో వీటిని వేసుకోవాలి.
ప్లెయిన్ టాప్‌కు రంగురంగుల బాటమ్ జత చేయాలి. ఈ బాటమ్‌కు ఉపయోగించిన వస్త్రాన్నే టాప్ చేతులు, అంచులకు జోడించాలి. అప్పుడు చుడీదార్ సాదాసీదాగా కాకుండా మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది
కాటన్ చుడీదార్‌కు లెగ్గింగ్, జెగ్గింగ్ బదులుగా పాటియాలా ప్యాంట్ ప్రయత్నించవచ్చు. పలాజోలు నేల మీద జీరాడేలా పొడవుగా ఉండకుండా, నీ లెంగ్త్ పలాజోలు కూడా ప్రయత్నించవచ్చు
డోరీలు, కుచ్చులు, కాలర్లు లాంటి కొత్త ప్రయోగాలు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. స్లీవ్‌లెస్ టాప్ కుట్టించుకుంటే, దాన్ని ఫ్రాక్‌లా కూడా వాడుకోవచ్చు
నెక్ డిజైన్‌లో ప్రయోగాలను అనుసరించాలి. హై నెక్, బోట్ నెక్, కాలర్ నెక్‌లు చుడీదార్‌కు ఆధునిక అందాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి ఆ మెడ డిజైన్ కోసం బాటమ్ వస్త్రాన్నే వాడుకోవాలి
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..
Read latest AP News And Telugu News
Updated Date - Jun 11 , 2025 | 05:08 AM