ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Work From Home: ఇంట్లో ఆఫీస్‌ స్పేస్‌

ABN, Publish Date - May 19 , 2025 | 04:18 AM

ఇంట్లో ప్రశాంతమైన ప్రాంతాన్ని ఎంచుకుని ఆఫీసు పనులకు అనుకూలంగా ఏర్పాటుచేసుకోవాలి. సరైన ఫర్నిచర్, కాంతి, అలంకరణలు వాడితే పని వాతావరణం మరింత ఉత్తమంగా మారుతుంది.

ఇంటి నుంచి పనిచేసే విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్ని సంస్థలు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని కల్పిస్తుంటే మరికొన్ని మాత్రం వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పనిచేయమంటున్నాయి. దీంతో ఇల్లే ఆఫీసులా మారిపోతోంది. ఇలాంటప్పుడు కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలుగకుండా ఇంట్లో ఆఫీస్‌ స్పేస్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం....

ముందుగా ఇంట్లో ప్రశాంతంగా ఉండే చోటుని ఎంపిక చేసుకోవాలి. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉపయోగించని గది అయితే మంచిది. అలా ప్రత్యేకమైన గది లేని పక్షంలో ఇంట్లో ఒక మూలగా ఆఫీస్‌ స్పేస్‌ను ఏర్పాటు చేసుకోవాలి. శబ్దాలు వినిపించని చోటైతే పని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఆఫీసు పని కోసం నిర్దేశించుకున్న చోట లేదా ఆ గదిలో ఒక టేబుల్‌ దాని ముందు సౌకర్యవంతంగా ఉండే కుర్చీని వేసుకోవాలి. పక్కనే కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా చిన్న స్టాండ్‌ లేదా ర్యాక్‌లను అమర్చుకోవాలి. ఓ మూలగా మొక్కల కుండీలు పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది.

టేబుల్‌ మీద కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌, కేబుల్‌ ఆర్గనైజర్‌, ఛార్జర్‌, నోట్‌ప్యాడ్‌, క్యాలెండర్‌, పెన్‌ స్టాండ్‌ తదితరాలను సర్దుకోవాలి. టేబుల్‌ లైట్‌, చిన్న ఫ్లవర్‌ వాజ్‌లను కూడా పెట్టుకుంటే బాగుంటుంది.

గోడలకు మంచి పెయింటింగ్స్‌ లేదా స్టిక్కర్స్‌ ఏర్పాటు చేస్తే కార్యాలయంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.

ఆఫీసు పని చేసుకునే గదిలో గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండాలి. రాత్రిపూట పనిచేసేవారు తెల్లటి కాంతిని ఇచ్చే ట్యూబ్‌లైట్లను అమర్చుకోవాలి. ఫ్యాన్‌ శబ్దం చేయకుండా చూసుకోవాలి.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:37 AM