అంచు అంచుకో కథ ఉంది
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:45 AM
త్వరలోనే పెళ్లిళ్లు, పండగలు వచ్చేస్తున్నాయి. పెళ్లిళ్లకు, పేరంటాలకు కొత్త కొత్త పట్టు చీరలతో అమ్మాయిలందరూ సిద్ధమయిపోతూ ఉంటారు. ఆకర్షణీయమైన అంచులు... చీర అందాన్ని మరింత...
త్వరలోనే పెళ్లిళ్లు, పండగలు వచ్చేస్తున్నాయి. పెళ్లిళ్లకు, పేరంటాలకు కొత్త కొత్త పట్టు చీరలతో అమ్మాయిలందరూ సిద్ధమయిపోతూ ఉంటారు. ఆకర్షణీయమైన అంచులు... చీర అందాన్ని మరింత పెంచుతాయి. అయితే అందరికీ అన్ని అంచులు నప్పవు. ఎలాంటి అంచులున్న చీరలు కొనుక్కొవాలి అనే ప్రశ్న అనేక మందిని వేధిస్తూ ఉంటుంది. ఎవరికి ఎలాంటి అంచులు నప్పుతాయో తెలుసుకుందాం..
ఏ చీరకు ఏ అంచు..: సాధారణంగా పట్టుచీరలకు కడి, గోపురం, మామిడి పిందెలు, మువ్వలు, నెమలి, పద్మాల డిజైన్లతో రూపొందించిన అంచులు ఉంటాయి. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ ప్రాంతాల సంప్రదాయాలను, అక్కడి పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. స్థానిక జీవన విధానాన్ని చాటి చెబుతాయి.
పొట్టిగా ఉన్నవారికి
అయిదు అడుగులు అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్నవారికి చిన్న అంచులు నప్పుతాయి. ఇలాంటి వారు ఒకటి రెండు అంగుళాల కన్నా పెద్ద అంచు ఉన్న చీరలు కట్టుకోకూడదు. వీలైనంత వరకు చీరలో కలిసిపోయే అంచులు ఎంచుకుంటే మంచిది.
చీర రంగుకు భిన్నంగా ఉన్న అంచును ఎంచుకుంటే అందంగా కనిపిస్తారు.
వీరు జరీ ఎక్కువగా ఉన్న అంచు చీరలు కట్టుకోకూడదు. నిలువు చారల చీరలు కట్టుకుంటే పొడవుగా కనిపిస్తారు.
పొడవుగా ఉంటే..
ఐదు అడుగుల కన్నా ఎత్తు ఎక్కువ ఉన్న వారు ఎనిమిది అంగుళాల అంచులు ఉన్న చీరలు కట్టుకున్నా బావుంటుంది.
చీర, అంచు రంగులు వేర్వేరుగా ఉంటే మంచి లుక్ వస్తుంది.
అంచులో ఎక్కువ జరీ.. రకరకాల డిజైన్లు ఉన్నా పర్వాలేదు. ఈ మధ్యకాలంలో కేవలం జంతువులు, పక్షులు మాత్రమే కాకుండా రామాయణం వంటి రకరకాల కథలతో కూడిన అంచులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
కంచి పట్టుచీరలకు గోపురాలు, దేవుడి చిత్రాలు, చక్రాలు
పోచంపల్లి చీరలకు సంప్రదాయ పద్ధతిలోని రేఖాగణిత రూపాలు
గద్వాల్ చీరలకు మువ్వలు, పద్మాలు, మామిడి పిందెలు
పైథాని చీరలకు నెమలి, చిలక, పద్మాల డిజైన్లతో అంచులను జోడిస్తారు.
వెంకటగిరి చీరలకు రకరకాల తీగలు, ఆకులు
ఖ్యాతి, హైదరాబాద్,
Read Latest Telangana News and National News
6300386749
Updated Date - Jun 22 , 2025 | 05:45 AM