బ్రాహ్మీ ముహూర్తం అంటే
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:58 AM
‘బ్రాహ్మీ ముహూర్తం’ అనే మాట మనం వింటూనే ఉంటాం. అది తెల్లవారుజాము సమయం అని అందరికీ తెలుసు. కానీ సరైన సమయం మాత్రం చాలామందికి తెలియదు. అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో...
తెలుసుకుందాం
‘బ్రాహ్మీ ముహూర్తం’ అనే మాట మనం వింటూనే ఉంటాం. అది తెల్లవారుజాము సమయం అని అందరికీ తెలుసు. కానీ సరైన సమయం మాత్రం చాలామందికి తెలియదు. అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారో తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందున్న 48 నిమిషాల సమయాన్ని ‘బ్రాహ్మీముహూర్తం’ అంటారు. ఇది పూజలకు, జపాలకు, మంత్రసాధనకు విశిష్టమైనదని పూర్వులు చెప్పారు.
ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి...
మన శరీరంలోని జీవక్రియలన్నీ మన లోపల ఉండే జీవ గడియార సమయం ప్రకారం జరుగుతాయి.
బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొనేవారికి జీవక్రియ సక్రమంగా సాగుతుంది. ఎందుకంటే ఉదయం వేళ మన శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది.
ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గించి, జ్ఞాపకశక్తిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అందుకే విద్యార్థులు ఆ సమయంలో చదువుకుంటే బాగా గుర్తుంటుందని, వారి జ్ఞాపకశక్తి పెరుగుతుందని విశ్వాసం ఉంది. అలాగే ఆ సమయంలో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంటాయి. కాబట్టి చదివినది నేరుగా మెదడులో నిక్షిప్తం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి తొందరగా నిద్రపోయి, సూర్యోదయానికి ముందే లేచేవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావంటోంది ఆయుర్వేదం. రాత్రంతా చెట్లు విడుదల చేసిన ఆక్సిజన్... వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉండేది బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే. ఉదయం నడకకు వెళ్ళేవారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతిరోజూ సూర్యోదయాన్ని చూసే అలవాటు ఉన్నవారి గుండె, మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి. లేలేత సూర్యకిరణాలు మనపైన ప్రసరించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. సూర్యరశ్మిలో ఉండే ‘విటమిన్-డి’ మన ఎముకలు బలంగా ఉండడానికి దోహదం చేస్తుంది.
సి.ఎన్. మూర్తి,అంబాజీపేట
8328143489
Also Read:
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
For More Business News
Updated Date - Jun 20 , 2025 | 05:58 AM