మొక్కలకు ఎప్పుడు నీళ్లు పోయాలి
ABN, Publish Date - Jul 03 , 2025 | 02:45 AM
మనం ఇంటి చుట్టూరా లేదంటే బాల్కనీల్లో మొక్కలను పెంచుతూ ఉంటాం. వాటి స్వభావాన్ని అనుసరించి రోజూ నీళ్లు పోస్తూ ఉంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి. మొక్కలకు...
మనం ఇంటి చుట్టూరా లేదంటే బాల్కనీల్లో మొక్కలను పెంచుతూ ఉంటాం. వాటి స్వభావాన్ని అనుసరించి రోజూ నీళ్లు పోస్తూ ఉంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి. మొక్కలకు ఏ సమయంలో నీళ్లు పోస్తే మంచిదో తెలుసుకుందాం...
సూర్యోదయానికి ముందే మొక్కలకు నీళ్లు పోయాలి. ఈ సమయంలో నేల లేదా కుండీలోని మట్టి చల్లగా ఉంటుంది. దీంతో మొక్కలు మెల్లగా నీటిని పీల్చుకుంటాయి. ఫలితంగా వేర్లు, కాండం, ఆకులు పూర్తిగా తేమతో నిండుతాయి. రోజంతా ప్రసరించే సూర్యరశ్మిని, వేడిని తట్టుకుని నిలబడతాయి. సూర్యోదయం తరవాత, మధ్యాహ్న సమయాల్లో మొక్కలకు నీళ్లు పోయకూడదు. అలా పోస్తే ఆకులు, వేర్లు దెబ్బతిని మొక్కలు త్వరగా ఎండిపోతాయి.
సాయంత్రం సూర్యాస్తమయం వెంటనే మొక్కలకు నీళ్లు పోయకూడదు. మొక్క భాగాలు, మట్టి చల్లబడే వరకూ ఆగాలి. చీకటి పడకుండా వెలుగు ఉన్నప్పుడే నీళ్లు పోయాలి.
రాత్రి వేళల్లో కూడా మొక్కలకు నీళ్లు పోయకూడదు. అలా చేస్తే హానికారక ఫంగ్‌సలు, క్రిమి కీటకాలు చేరి మొక్కలకు నష్టం కలిగిస్తాయి.
వర్షాకాలంలో అయితే రోజూ కాకుండా రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు. శీతాకాలంలో మట్టిని గమనించి అవసరం మేరకు ఉదయమే నీటిని చిలకరించాలి.
కొన్ని మొక్కలకు నీళ్లు ఎక్కువగా అవసరమవుతాయి. కొన్నింటికి మట్టి తేమగా ఉంటే చాలు. వాటి స్వభావం గురించి పూర్తిగా తెలుసుకుని ఆ ప్రకారమే నీళ్లు అందిస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి..
క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 02:45 AM