Sabja Seeds: సబ్జా గింజలతో అందం ఆరోగ్యం
ABN, Publish Date - Jul 31 , 2025 | 01:12 AM
సబ్జా గింజలు శరీరంలో వేడిని తగ్గిస్తాయని తెలిసిందే. అయితే వాటి వలన మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందానికి వన్నెలద్దడంతోనూ అవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ...
సబ్జా గింజలు శరీరంలో వేడిని తగ్గిస్తాయని తెలిసిందే. అయితే వాటి వలన మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందానికి వన్నెలద్దడంతోనూ అవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు
తెలుసుకుందాం...
సబ్జా గింజలోని యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లను దరి చేరనీయవు.
డీటాక్స్ గుణాలు చర్మంలోని టాక్సిన్లకు బయటకు పంపుతాయి. దాంతో చర్మం మెరుస్తుంది.
ఈ గింజల్లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.
సబ్జా గింజల్లోని ప్రోటీన్లు, బీటా కెరోటిన్, విటమిన్ కె- కురులకు పోషణ అందించి దృఢంగా మార్చుతాయి.
ఆరోగ్యం కూడా
సబ్జా గింజల్లోని అధిక పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
సబ్జా గింజలు ఎడిడిటిని దరిచేరనీయవు. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.
ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇవి కూడా చదవండి
రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..
అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
Updated Date - Jul 31 , 2025 | 01:12 AM