ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ayurvedic Remedies: వానాకాలం వెతలకు చెక్‌

ABN, Publish Date - Jun 03 , 2025 | 05:13 AM

వానాకాలంలో వాతం, పిత్తం పెరుగుతూ జీర్ణశక్తి తగ్గిపోవడం వల్ల రోగనిరోధకశక్తి కూడా తగ్గుతుంది. trikatulu, శడంగ పానీయం వంటి ఆయుర్వేద చికిత్సలు వానాకాల అనారోగ్యాలను తగ్గించడంలో సహాయకారిగా ఉంటాయి.

వానాకాలం జలుబు, దగ్గు, జ్వరాలు సహజమే! అయితే వీటన్నిటి మూల కారణం జీర్ణ వ్యవస్థలో ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. ఈ కాలంలో కుంటుపడే జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థలను ఎలా దార్లోకి తెచ్చుకోవాలో తెలుసుకుందాం!

వానాకాలంలో శరీరంలో వాతం, పిత్తం పెరుగుతాయి. ఆదాన కాలమైన వేసవిలో కుంటుపడే జీర్ణశక్తి, వానాకాలంలో మరికాస్త దిగజారుతుంది. దాంతో అరుగుదల మందగిస్తుంది. ఫలితంగా పేగుల్లోని మంచి బ్యాక్టీరియా క్షీణించి, రోగనిరోధకశక్తి కూడా సన్నగిల్లుతుంది. దీనికి తోడు వానాకాలంలో వ్యాధికారక సూక్ష్మక్రిములు విజృంభించడం, కలుషిత ఆహారం, నీటి వల్ల సులభంగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. అయితే దగ్గు, జలుబులు, జ్వరాలు చలికాలంలో కూడా వేధిస్తాయి. కానీ వాటికి ప్రధానంగా గాల్లో విస్తరించి ఉండే వ్యాధికారక సూక్ష్మక్రిములు పొడిబారిన శ్వాసకోస వ్యవస్థలోకి సులువుగా చొరబడి ఇబ్బంది పెట్టడమే కారణం. కానీ వానాకాలపు జలుబు, దగ్గు, జ్వరాలకు మాత్రం సన్నగిల్లిన వ్యాధినిరోధకశక్తే ప్రధాన కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో తలెత్తే అసౌకర్యాలకు కారణాన్ని బట్టి చికిత్సను అందించాల్సి ఉంటుంది.

త్రికటుతో తరిమికొట్టి...

త్రికటువులైన శొంఠి, మిరియాలు, పిప్పళ్లు ఈ కాలంలో తీసుకుంటూ ఉండాలి. ఈ పొడిని పండ్ల మీద చల్లుకుని తినొచ్చు. లేదా నేరుగా తినొచ్చు. గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగొచ్చు. దీంతో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసకోస వ్యవస్థ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కూడా దొరుకుతుంది. కాబట్టి రోజుకు పావు టీస్పూను చొప్పున త్రికటు తీసుకోవచ్చు. ఇదే కాకుండా తాలిసాది చూర్ణం, సీతోఫలాది చూర్ణాలు కూడా వానాకాలపు అనారోగ్యాల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. జలుబు వచ్చినా, రాబోతున్నట్టు అనిపించినా త్రికటు, లేదా సీతాఫలాది లేదా తాలిసాది చూర్ణాల్లో ఏదో ఒకదాన్ని తీసుకోవచ్చు. పెద్దలు ఉదయం, సాయంత్రం ఒక చెంచా చూర్ణాన్ని తేనెతో లేదా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. తేనె స్వచ్ఛంగా ఉండాలి.


జలుబు, దగ్గు, జ్వరం

జ్వరాన్ని తగ్గించడం కోసం ‘షడంగ పానీయం’ తీసుకోవచ్చు. అరచెంచా పొడిని రెండు గ్లాసుల నీళ్లలో కలిపి, ముప్పావు వంతుకు మరిగించి, వడగట్టి రెండు పూటలూ తీసుకోవాలి. జలుబుకు ‘వ్యోషాది వటి’ ఉపయోగపడుతుంది. ఉదయం, రాత్రి రెండు మాత్రల చొప్పున తీసుకోవాలి. రెండేళ్ల లోపు పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలను తగ్గించడం కోసం ‘కస్తూరి’ మాత్రలు అందించాలి. ఒకటి లేదా రెండు మాత్రలను దంచి తల్లిపాలలో లేదా మరిగించి చల్లార్చిన నీళ్లలో రంగరించి పిల్లలకు పట్టించవచ్చు. ‘వాయు గుళిక’ జలుబుకు సమర్థమైన ఔషధం. ఈ గుళికను మూడు పూటలా తీసుకోవాలి. నవజ్వరానికి (ప్రారంభంలో ఉన్న జ్వరం) శొంఠి, అల్లపు రసం, మిరియాలు, తేనె కలిపి చెంచా చొప్పున మూడు పూటలూ ఇవ్వాలి. పొట్టలో సమస్యలకు, నీళ్ల విరోచనాలకు ‘కుటజ ఘనవటి’ మూడు పూటలా రెండు మాత్రల చొప్పున తీసుకోవాలి. పిల్లలకు అర మాత్ర సరిపోతుంది. ద్రవరూపంలోని కుటజారిష్ఠ అయితే, పెద్దలు, 15 మిల్లీలీటర్ల చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. నులిపురుగుల సమస్యలు కూడా ఈ కాలంలో ఎక్కువే! దీని కోసం ద్రవరూపంలోని ‘విడంగారిష్ఠ’ను 15 మిల్లీలీటర్ల చొప్పున మూడు పూటలూ తీసుకోవాలి. పిల్లలకు 10 మిల్లీలీటర్లు సరిపోతుంది.


తినవలసినవి - తినకూడనివి

ఈ కాలంలోని ఆరోగ్య సమస్యలకు సన్నగిల్లిన వ్యాధినిరోధకశక్తి ప్రధాన కారణం కాబట్టి అందుకు కారణమైన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం మీదే ధ్యాస పెట్టాలి. అందుకోసం జీర్ణ సంబంధ సమస్యలను నియంత్రించుకోవాలి. కొన్ని పదార్థాలను తినడం మానుకోవాలి. కొన్నిటిని తప్పనిసరిగా తింటూ ఉండాలి.

తినకూడనివి: పచ్చి కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి తినాలి. మొక్కజొన్నను ఉడికించకుండా, కాల్చి తినాలి. సజ్జలు, మార్కెట్లో దొరికే పాలకూర తినకూడదు. ఇంట్లో పండించిన పాలకూర తినొచ్చు. అలాగే కాకరకాయ, క్యాబేజీ, బంగాళాదుంపలు, క్యారెట్‌ తినకూడదు. కఫాన్ని పెంచే చేపలు తగ్గించాలి. ఆవు పాలు తీసుకోవచ్చు. గేదె పాలు మానేయాలి. కఫాన్ని పెంచే తీపి పదార్థాలు, వెన్న, జున్ను తీసుకోకూడదు. అలాగే చల్లదనాన్ని అందించే కీర, పుచ్చ ఈ కాలంలో పనికిరాదు. మజ్జిగను నేరుగా తీసుకోకుండా మజ్జిగపులుసు రూపంలో తీసుకోవచ్చు.

తినదగినవి : బెండ, పెసరపప్పు, మినప్పప్పు, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవచ్చు. ఉల్లి, వెల్లుల్లిలో నీటిలో కరిగే పీచు ఉంటుంది. ఇది పేగులకు మంచిది కాబట్టి వీటిని ఈ కాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. దుంపల్లో కంద తినొచ్చు. ద్రాక్ష పండ్ల మీద తెల్లని పొర ఉంటుంది. ఇది అందరూ అనుకుంటున్నట్టు పురుగుమందులతో ఏర్పడిన పొర కాదు. అది ఆరోగ్యానికి మేలుకరమైన బ్యాక్టీరియా పొర. కాబట్టి ద్రాక్షను కడిగినా, ఈ తెల్లని పొర తొలగిపోకుండా చూసుకోవాలి. మామిడి, నిమ్మ పండ్లు తీసుకోవచ్చు. ఈ కాలంలో కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి.

డాక్టర్‌ డి.వి. ప్రశాంత్‌ కుమార్‌

పంచకర్మ స్పెషలిస్ట్‌, శక్తి ఆయుర్వేదిక్‌ క్లినిక్‌,

ఈస్ట్‌ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:13 AM