ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amino Acids: బరువు తగ్గించే అమైనో ఆమ్లం

ABN, Publish Date - Jun 03 , 2025 | 04:56 AM

తృణధాన్యాలు, మాంసంలో ఉండే సిస్టీన్‌ అనే అమైనో ఆమ్లం బరువు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సిస్టీన్‌ లేకుండా చేసిన ఆహారం ఎలుకలలో వేగంగా బరువు తగ్గించగా, మానవుల్లో కూడా ఈ విధానానికి ప్రతికూల ఫలితాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు.

బరువు తగ్గడంలో అమైనో ఆమ్లం కీలక

పాత్ర పోషిస్తుందని అమెరికా, కెనడా

పరిశోధకులు కనుగొన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం...

మాంసం, తృణధాన్యాల్లోని సిస్టీన్‌ అనే అమైనో ఆమ్లం, బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎలుకలపై చేసిన ఓ తాజా అధ్యయనంలో తేలింది. దీని వలన అమైనో ఆమ్లాలతో ఔషధాల అభివృద్ధికి అవకాశం కలుగుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 9 రకాల అమైనో ఆమ్లాలు లేని ఆహారం అందించి ఎలుకలను పరిశీలించినప్పుడు, పలు అణువులను అమైనో ఆమ్లంగా మార్చే ఎంజైమ్‌ లోపించిన ఎలుకలు, సిస్ట్టీన్‌ రహిత ఆహారం తిని వారంలోనే 31 శాతం బరువు తగ్గినట్లు నేచర్‌లో ప్రచురితమైన ఆ అధ్యయనంలో వెల్లడించారు. అయితే ఎంజైమ్‌ ఉన్న ఎలుకలు సిస్టీన్‌ రహిత ఆహారం తీసుకున్నా బరువు తగ్గలేదు. అయితే ఆ ఎంజైమ్‌ ఉన్న ఎలుకలు పరిమిత క్యాలరీల సిస్ట్టీన్‌, మిథియోనిన్‌ లేని ఆహారం తీసుకున్నప్పుడు, 25 శాతం బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.


మనుషులకు మంచిదేనా?

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివ ర్సిటీలో చేసిన ఓ మానవ ప్రయోగంలో... సిస్టీన్‌, మెథియోనిన్‌ తక్కువగా ఉన్న ఆహారం తిన్న వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనుగొనలేదని, అలాగే వారు బరువు తగ్గినట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ విధమైన ఆహారం ప్రజలపై ఎంత ప్రభావంతంగా పనిచేస్తుంది, ఏ మేరకు సురక్షితమన్నది తెలుకోవడం కోసం మరిన్ని పరిశోధనలకు అవసరమని వారు పేర్కొన్నారు. సిస్టీన్‌ చాలా ఆహార పదార్థాల్లో ఉంటుంది కాబట్టి ఆహారం ద్వారా సిస్టీన్‌ అందకుండా చేయడం సవాలుతో కూడుకున్న విషయమని అభిప్రాయపడ్డారు. కాబట్టి సిస్టీన్‌ స్థాయులను అవసరమైన మేర తగ్గించడానికి ఔషధాలను అభివృద్ధి చేయడం సరైన మార్గమనీ, ఆ ఔషధాలు కొవ్వు తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 04:56 AM