Yamuna Curse: యమునా శాపం తగిలింది.. అతిషితో ఎల్జీ
ABN, Publish Date - Feb 10 , 2025 | 03:58 PM
యమునా నది పునరుజ్జీవనానికి ఎల్జీ పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీని 2023 జనవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇందుకు తొలుత ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణల తొలగించడం,11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడ జరిగింది.
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎవరూ కారణాలు వెతుక్కోరు. ఓటమి పాలైనప్పుడు మాత్రం అనేక కారణాలు తెరపైకి వస్తాయి. పదేళ్లకు పైగా అప్రతిహతంగా హస్తినను పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. 'యమునా' (Yamuna) నది శాపం వల్లే 'ఆప్' ఓటమి పాలైనట్టు ఢిల్లీ మాజీ సీఎం అతిషితో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషి తన రాజీనామాను సమర్పించేందుకు ఎల్జీని కలిశారు. ఈ సమయంలో ఎల్జీ అతిషితో మాట్లాడుతూ, యమునా నదిని శుభ్రపరచే ప్రాజెక్టును నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఇద్దరం కలిశామని, అప్పుడు యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించారని, తన మాటను పెడచెవిన పెట్టారని అతిషితో సక్సేనా చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Sheesh Mahal: 'శీష్ మహల్'కు కొత్త సీఎం దూరం
యమునా నది శాపం గురించి కేజ్రీవాల్‌ను సక్సేనా హెచ్చరించినట్టు చెబుతున్న విషయం రెండేళ్ల క్రితం నాటిది. యమునా నది పునరుజ్జీవనానికి ఎల్జీ పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీని 2023 జనవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇందుకు తొలుత ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణల తొలగించడం,11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడ జరిగింది. అయితే ఆ తర్వాత క్రమంలో ట్రిబ్యునల్ ఆదేశాలను సుప్రీంకోర్టులో ఆప్ ప్రభుత్వం సవాలు చేసింది. దీంతో ట్రిబ్యునల్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం రెండేళ్లుగా ఆ స్టే కొనసాగుతోంది. ఎల్జీ పర్యవేక్షణలో పనులు జరిగితే తమ ప్రభుత్వానికి క్రెడిట్ రాదనే అభిప్రాయంతోనే ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందనే అపప్రదను మూటకట్టుకుంది. సుప్రీంకోర్టు రూలింగ్ తర్వాత ఒక సందర్భంలో కేజ్రీవాల్ కలిసినప్పుడు యమునా నది శాపం పెడుతుందని ఆయనను ఎల్జీ హెచ్చిరించినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో యమునా నదీ జలాల అంశం కూడా తెరపైకి వచ్చింది. 'యమున'లో విషం కలుస్తోందంటూ హర్యానా ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టడం, ఇది పెద్ద వివాదానికి దారితీయడం, ఆయన వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం జరిగింది. యమునా జలాల శుద్ధీకరణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయామని కేజ్రీవాల్ చివరకు ఒప్పుకుంటూనే, మరోసారి అధికారమిస్తే మాట నిలుపుకొంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ...అప్పటికే యమునా జలాల విషయంలో జరిగిన డ్యామేజీ 'ఆప్'ను ఎన్నికల ఫలిలాల్లో గట్టిగా దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..
Updated Date - Feb 10 , 2025 | 04:00 PM