Home » Yamuna
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రోడ్లు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు రాజధానిలో వరద హెచ్చరికలు జారీ చేశారు.
యమునా నది పునరుజ్జీవనానికి ఎల్జీ పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీని 2023 జనవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇందుకు తొలుత ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణల తొలగించడం,11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడ జరిగింది.
యమునా జలాల్లో "విషం'' కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘోండా శాసనసభ నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రధాని బుధవారంనాడు మాట్లాడుతూ, యుమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా పుష్యపౌర్ణమి రోజున(జనవరి 13వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గడ్డకట్టించే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దీని వెనక ఉన్న రహస్యమిదే..
యమునానది గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద పుట్టి అలహాబాదులోని గయ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఈ నది సప్త గంగలలో ఒకటి. అయితే యమునా నదిలో కాలుష్య విష నురుగు కక్కుతోంది. కార్తీక మాసం స్నానాలు చేయడానికి యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.
పుణ్యనదుల్లో ఒకటైన యమునా నది జలాలు అత్యంత కలుషితంగా మారాయి. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండడంతో విషపు నురగలు తేలియాడుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ది చేయని మురుగు నీటిని కూడా మయునలోకే వదులుతున్నారు.
యమునా నదీ జలాల క్లీనింగ్ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని, అవినీతికి పాల్పడిందని వీరేంద్ర సచ్‌దేవ గత గురువారం ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఐటీఓ సమీపంలోని గంగా ఘాటా వద్ద స్నానం చేశారు. యమునా నది పరిస్థితిపై పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన సవాలు విసిరారు.
ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త కుట్రకు తెర తీసిందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిశీ ఆరోపించారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత సృష్టించేందుకు మోదీ సర్కార్ పథక రచన చేసిందన్నారు.