Arvind Kejriwal: కొంపముంచిన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు
ABN , Publish Date - Jan 29 , 2025 | 09:32 PM
యమునా జలాల్లో "విషం'' కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: యమునా జలాల్లో "విషం'' కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తు్న్నారంటూ హర్యానా సర్కార్ పై అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై హర్యానా (Haryana) కోర్టు ఆయనకు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ అసత్య ప్రచారంతో ఢిల్లీ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారంటూ హర్యానా ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు జారీ చేస్తూ, తన ఆరోపణల వెనుక ఉన్న కారణాలను వివరించాలని, ఆధారాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
PM Modi: నేను తాగుతున్న నీళ్లు కూడా అవే... ఆప్‌పై మోదీ నిప్పులు
పీఎం తాగే నీటిలో విషం కలపగలరా?
కాగా, దీనికి ముందు ఢిల్లీలోని ఘోండా శాసనసభ నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కేజ్రీవాల్‌ను తప్పుపట్టారు. యమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలం కావడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై నిందారోపణలు తగదన్నారు. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించడం లేదా? అప్పుడు ఢిల్లీ జలాలను ఎలా విషమయం చేస్తుంది? ప్రధాని కూడా ఈ జలాలే తాగుతున్నారని మోదీ పేర్కొన్నారు.
యమునా నదిలో నీటిని తాగిన హర్యానా సీఎం
మరోవైపు, యమునా నదీ జలాలను విషపూరితం చేశారంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యల నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారంనాడు యమునా నది వద్ద నీరు తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News