Yamuna River: ప్రారంభమైన యమునా నదిలో కాలుష్య ప్రక్షాళన
ABN, Publish Date - Feb 21 , 2025 | 04:27 PM
Yamuna River: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. తాము అధికారంలోకి వస్తే.. యమునా నదిని శుభ్రం చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందు పరిచింది. నదిని పునరుద్దరించడంలో భాగంగా యమునను శుభ్రపరిచి.. ఆ నీటిని సాగు, తాగు నీటికి వినియోగించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని న్యూఢిల్లీలోని యమునా నదిలో కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమైనాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఇంకా చెప్పాలంటే.. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టే రెండు రోజుల ముందు ఈ నదీ ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. యమునను శుభ్రపరిచే కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో.. యంత్రాల సహాయంతో నదిలో చెత్తను తీసి వేస్తున్నారు.
అందుకోసం ఢిల్లీ ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందించింది. అందులోభాగంగా.. చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలు తీసే యంత్రాలతో నదిలో క్లీనింగ్ పనులు చేపట్టారు. యమునా నదిని శుభ్రం చేసేందుకు బహుముఖ వ్యూహాంతో ప్రభుత్వం ముందుకు వెళ్లోంది. మూడు సంవత్సరాల్లో యమునా నదిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్దేశించుకొంది.
బీజేపీ మేనిఫెస్టోలో..
అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. తాము అధికారంలోకి వస్తే.. యమునా నదిని శుభ్రం చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందు పరిచింది. నదిని పునరుద్దరించడంలో భాగంగా యమునను శుభ్రపరిచి.. ఆ నీటిని సాగు, తాగు నీటికి వినియోగించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో యమున నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Also Read: తొక్కిసలాటలో 121 మంది మృతి.. బోలే బాబాకు క్లీన్ చీట్
ఇక సెప్టెంబర్ 15వ తేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఉన్నతాధికారులతో సమావేశమై.. యమునా నదిలోని నీటి ప్రక్షాళనకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి.. ఉన్నత స్థాయికి వారాంతంలో నివేదిక అందచేయాలని అది కూడా ఈ సమావేశంలో ఎల్ జీ ఆదేశించారు.
అయితే 2015లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ.. రానున్న ఐదేళ్లలో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని ఆ ప్రభుత్వం నెరవేర్చలేదు సరికదా.. 2025 నాటికి ఈ నది మరింత కాలుష్యంగా మారింది. అయితే 2015, 2021 మధ్య యమునా నదిని కాలుష్యం కోరల నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు దాదాపు రూ. 6856.91 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక బీజేపీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం రాం లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 3.00 గంటలకు ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఏంఓ కార్యాలయ సిబ్బందితో భేటీ అయ్యారు. ఆ తర్వాత వసంత్ ఘాట్ సమీపంలోని యమునా హరతి కార్యాక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలు కైవసం చేసుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం వరుసగా మూడోసారి సైతం ఖాతా తెరవ లేదు.
దాదాపు 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలే ఆ పార్టీ గెలుపునకు బాట వేసిందనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా.. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతితోపాటు ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వైఖరి సైతం ఆప్‌ను ప్రతిపక్షానికి పరిమితం చేసిందని వాదన నడుస్తోంది.
For National News and Telugu News
Updated Date - Feb 21 , 2025 | 04:29 PM