Delhi Election Result: ఆ ఒక్క మాట ఆప్ కొంప ముంచిందా..
ABN, Publish Date - Feb 08 , 2025 | 12:31 PM
Delhi Election Results 2025: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. అధిక్యం రౌండ్ రౌండ్‌కు మారుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ల వరకు ఆప్, బీజేపీ మధ్యనే ప్రధానపోటీ కనిపించింది. కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది.
Delhi Election Results 2025: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. అధిక్యం రౌండ్ రౌండ్‌కు మారుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ల వరకు ఆప్, బీజేపీ మధ్యనే ప్రధానపోటీ కనిపించింది. కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. సుదీర్ఘకాలం ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకోవడం కష్టంగా మారింది. ప్రస్తుతానికి ఎన్నికల సంఘం అధికారిక గణాంకాల ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. ఆప్ 28 స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి. ప్రస్తుతానికి ఉన్న ఫలితాల సరళిని చూస్తే బీజేపీ అధికారానికి అవసరమైన మెజార్టీని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవడానికి 36 సీట్లు అవసరం. బీజేపీ 40కి పైగా సీట్లలో అధిక్యంలో కొనసాగుతుండటంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సూచనలు అధికంగా ఉన్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వస్తే మరెన్నో చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కేజ్రీవాల్‌వైపు ఓటర్లు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అసలు ఆప్ చేసిన ఒకేఒక తప్పు ఆ పార్టీ కొంపముంచిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆప్ కొంపముంచిన ఆ ఒక్క మాట ఏమిటో తెలుసుకుందాం.
కేంద్రం సహకరించడం లేదంటూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనకు సహకరించడంలేదని, తనను పట్టుబట్టి వేధిస్తోందంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం సహకరించడంలేదని, తాను మోదీని ఎదుర్కొనే దమ్మున్న నాయకుడినంటూ ప్రచారం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఢిల్లీ ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ ప్రచారమే కేజ్రీవాల్‌ను దెబ్బతీసిందనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఒక పార్టీ, ఢిల్లీ శాసనసభలో మరోపార్టీ ఉంటే ఢిల్లీ అభివృద్ధికి ఇబ్బందికరంగా మారుతుందనే ఆలోచనతో ఈసారి ఢిల్లీ ప్రజలు ఓటు వేసినట్లు ఫలితాల సరళి చూస్తే తెలుస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఢిల్లీ అభివృద్ధికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆలోచనతో ఓటరు ఈసారి బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
కేంద్రంతో కేజ్రీవాల్ సఖ్యతగా లేకపోవడమే ఆయనకు ఈ ఎన్నికల్లో మైనస్‌గా మారినట్లు ఫలితాల సరళిని చూస్తే అర్థమవుతోంది. ఓ రకంగా బీజేపీని విమర్శించేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రచారం ఆయనకే వ్యతిరేకంగా మారిందనే చర్చ లేకపోలేదు. కేంద్రంలో మరో నాలుగేళ్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పు ఉండదు. ఢిల్లీలో ఆప్‌ను గెలిపిస్తే కేంద్రంతో మరో నాలుగేళ్లు యుద్ధవాతావరణమే ఉంటుందని ఆలోచించిన ఢిల్లీ ఓటరు ఈసారి బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్లమ్ ఏరియాల్లో మాత్రం ఆప్ వైపు ఓటర్లు అధికంగా మొగ్గుచూపారనే విషయం ఓట్ల శాతాన్ని చూస్తే తెలుస్తోంది.
Also Read:
ఢిల్లీ సీఎం అతడే..అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..
ఢిల్లీ ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
For More National News and Telugu News..
Updated Date - Feb 08 , 2025 | 12:31 PM