ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Scam Prevention: వాట్సాప్‌లో స్కామ్‌ల నుంచి మరింత రక్షణ

ABN, Publish Date - Aug 07 , 2025 | 05:43 AM

ఫిషింగ్‌, మెసేజింగ్‌ స్కామ్‌ల నుంచి వాట్సాప్‌ వినియోగదారులకు రక్షణ కల్పించేలా మెటా కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.

  • ‘సేఫ్టీ ఓవర్‌ వ్యూ’ పేరుతో కొత్త సౌకర్యాన్ని తెచ్చిన మెటా

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఫిషింగ్‌, మెసేజింగ్‌ స్కామ్‌ల నుంచి వాట్సాప్‌ వినియోగదారులకు రక్షణ కల్పించేలా మెటా కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ‘సేఫ్టీ ఓవర్‌ వ్యూ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సౌకర్యం స్కామ్‌లకు కారణమయ్యే గ్రూప్‌ల సమాచారాన్ని ఆటోమేటిక్‌గా గ్రహించి వినియోగదారుడిని హెచ్చరిస్తుంది. వినియోగారుని కాంటాక్ట్‌ జాబితాలో లేని వారు ఎవరైనా వారిని వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేస్తే వెంటనే కొత్త యాంటీ స్కామ్‌ టూల్‌ దానంతట అదే యాక్టివేట్‌ అవుతుంది. గ్రూప్‌లో యాడ్‌ చేసిన వ్యక్తి సమాచారాన్ని, గ్రూప్‌లో ఉన్న సభ్యుల సంఖ్యను, గ్రూప్‌ను సృష్టించిన వ్యక్తి సమాచారాన్ని, గ్రూప్‌ను క్రియేట్‌ చేసిన తేదీని తెలియచేస్తుంది. వివరాలన్నీ పరిశీలించిన వినియోగదారుడు గ్రూప్‌లో చేరాలా? వద్దా? నిర్ణయించుకోవచ్చు. కాగా, వ్యక్తులు పంపే స్కామ్‌ సందేశాల నుంచి రక్షణ కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు మెటా పేర్కొంది. తాజాగా స్కామ్‌ కేంద్రాలతో లింక్‌ అయిన 68 లక్షల ఖాతాలను బాన్‌ చేసినట్లు వాట్సాప్‌ పేర్కొంది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న టెక్‌ దిగ్గజం కూడా వ్యక్తిగత స్కామ్‌ సందేశాల నుంచి రక్షణ ఇవ్వడం కోసం చిట్కాలను ఇస్తోంది. కొత్త వ్యక్తులు వాట్సా్‌పలో చాట్‌ చేయడానికి ప్రయత్నించినపుడు స్పందించడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించడం, ప్రశ్నించడం, సరిపోల్చుకోవడం ద్వారా స్కామ్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చుని ఆ టెక్‌ దిగ్గజం సూచించింది.

Updated Date - Aug 07 , 2025 | 05:45 AM