UCC: నేడు యూసీసీ అమలు.. ఏ మార్పులు అమల్లోకి వస్తాయంటే..
ABN, Publish Date - Jan 27 , 2025 | 11:46 AM
ఈరోజు యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అయితే ఈ చట్టం ప్రాముఖ్యత ఏంటి, దీని అమలు వల్ల ఎలాంటి మార్పులు వస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో ఉత్తరాఖండ్ (Uttarakhand) సోమవారం (27 జనవరి 2025) యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు చేసే తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ చట్టం కింద ప్రస్తుతం కులం, మతం, లింగం ఇతర అంశాల ఆధారంగా వివక్ష చూపించే వ్యక్తిగత పౌర చట్టాల్లో ఏకరూపత తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని సన్నాహాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ కీలక ప్రకటన గురించి అనౌన్స్ చేశారు.
అమలు చేసేందుకు..
''ప్రియమైన రాష్ట్ర నివాసితులారా జనవరి 27, 2025 నుంచి రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు చేయబడుతుంది. ఈ చట్టం అమలు చేసినందున ఉత్తరాఖండ్ రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో UCC అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని సన్నాహాలను పూర్తి చేశాము. ఇందులో చట్టం నియమాల ఆమోదం, సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చే అంశాలు కూడా ఉన్నాయి.'' - ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
ఈ నిర్ణయం ద్వారా..
UCC ప్రయోజనాలపై ఆయన మాట్లాడుతూ "ఈ చట్టం సమాజంలో ఏకరూపతను తీసుకువస్తుంది. అన్ని పౌరులకు సమాన హక్కులు, బాధ్యతలను ఇస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే దిశగా మన రాష్ట్రం తీసుకున్న ఒక ముందడుగు. UCC అమలు కోసం ముఖ్యమంత్రి ధామి ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా ఈ చట్టం కింద ఏర్పడిన కొత్త నియమాలను వివరణాత్మకంగా ప్రజలకు అందించనున్నారు. వివాహం, విడాకులు, నిర్వహణ, వారసత్వం, దత్తత, ఇతర వ్యక్తిగత పౌర చట్టాల మార్పులు ఈ చట్టంలో భాగంగా ఉన్నాయి.
యూసీసీ అమలు నేపథ్యంలో జరగనున్న కీలక మార్పులు
వివాహం నమోదు తప్పనిసరి : ఇప్పుడు అన్ని వివాహాలను నమోదు చేయాలి.
ఏకరీతి విడాకుల చట్టం: కులం లేదా మతం ఆధారంగా వివక్ష చూపకుండా అన్ని వర్గాలకు ఒకే విడాకుల చట్టం వర్తిస్తుంది
వివాహా కనీస వయస్సు: అన్ని మతాలు, కులాల బాలికలకు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు నిర్ణయించబడింది
దత్తత తీసుకునే సమాన హక్కులు: దత్తత అన్ని మతాలకు తెరిచిన విషయం అయినప్పటికీ, ఒక మతం నుంచి మరో మతం పిల్లలను దత్తత తీసుకోవడం నిషేధం
ఆచారాల రద్దు: 'హలాలా', 'ఇద్దత్' వంటి కొన్ని ఆచారాలు ఇకపై రాష్ట్రంలో అనుమతించబడవు
ఏకపత్నీవ్రతం: మొదటి జీవిత భాగస్వామి జీవించి ఉంటే రెండో వివాహం అనుమతించబడదు
సమాన వారసత్వ హక్కులు: కుమారులు, కుమార్తెలు వారసత్వంలో సమానంగా హక్కులు పొందుతారు
లివ్-ఇన్ రిలేషన్షిప్ నియమాలు: లివ్-ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 18 నుంచి 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భాగస్వాములకు, తల్లిదండ్రుల సమ్మతి అవసరం
లివ్-ఇన్ సంబంధాల నుంచి జన్మించిన పిల్లల హక్కులు: లివ్-ఇన్ సంబంధాల నుంచి జన్మించిన పిల్లలకు వివాహిత జంటల పిల్లలతో సమానమైన హక్కులు ఉంటాయి.
యూసీసీ చట్టం అంతటా ఒకేలా ఉంటుందా..
గత ఏడాది ఫిబ్రవరి 6న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీజేపీ ప్రభుత్వం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 7న అసెంబ్లీ మెజారిటీతో ఆమోదించింది. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 13న దానిపై సంతకం చేశారు. దీంతో ఉత్తరాఖండ్ భారతదేశంలో UCC అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
Siddaramaiah: సీఎం బహుమతి తిరస్కరించిన ఖోఖో ప్రపంచ కప్ ఆటగాళ్లు.. కారణమిదే..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 27 , 2025 | 11:46 AM