ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Education: అనధికార వైద్య కాలేజీల్లో చేరొద్దు: ఎన్‌ఎంసీ

ABN, Publish Date - May 21 , 2025 | 08:03 AM

జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) విద్యార్థులకు అనధికార వైద్య కాలేజీల్లో చేరకూడదని హెచ్చరించింది. విద్యార్థులు, ఎంబీబీఎస్‌ కోర్సు కోసం ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉన్న గుర్తింపు పొందిన కాలేజీలను మాత్రమే ఎంచుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ, మే 20: వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు.. ఎలాంటి గుర్తింపు లేని, లేదా నకిలీ గుర్తింపుతో నడుస్తున్న అనధికార కాలేజీల్లో చేరొద్దని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. దేశంలో కొన్ని కళాశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఎంబీబీఎ్‌సలో చేరగోరు విద్యార్థులు ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన మెడికల్‌ వర్సిటీలను పరిశీలించి ఎంచుకోవాలని సూచించింది. ఇక, విదేశాల్లో ఏ యూనివర్సిటీని ఎంచుకున్నా అక్కడే కనీసం 54 నెలల పాటు కోర్సు చేయాలని, 12 నెలల పాటు అదే దేశంలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాలని పేర్కొంది. వారికి మాత్రమే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ లైసెన్స్‌(ఎ్‌ఫఎంజీఎల్‌) లభిస్తుందని వివరించింది.

Updated Date - May 21 , 2025 | 08:04 AM