ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ADB: ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడితో కేంద్ర మంత్రి భేటీ

ABN, Publish Date - May 31 , 2025 | 08:15 AM

కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆసియా అభివృద్ధి బ్యాంకు(ADB) అధ్యక్షుడు మసాటో కందాతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో..

Union Minister Manohar Lal Khattar meets President Asian Development Bank Masato Kanda

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆసియా అభివృద్ధి బ్యాంకు(ADB) అధ్యక్షుడు మసాటో కందాతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత పట్టణీకరణ గురించి, 'వికసిత్ భారత్ 2047' గురించి చర్చించారు. దేశంలో పలు రంగాల అభివృద్ధికి, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు ADB ఇతోధికంగా దోహదం చేస్తోందని కేంద్రమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

దేశంలో మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్, ఇన్‌క్లూజివ్ హౌసింగ్, అర్బన్ శానిటేషన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ గవర్నెన్స్ వంటి రంగాల్లో సంస్కరణలపై వీరిరువురు చర్చించారు. దేశవ్యాప్తంగా ఉత్తమ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్స్ నమూనాలు మొబిలిటీ రంగం అభివృద్ధికి ఎంతగా ఉపకరిస్తున్నాయన్న అంశాన్ని కేంద్ర మంత్రి ఏడీబీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.


దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ , PMAY-అర్బన్ వంటి కీలక కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని కూడా మంత్రి ఈ సమావేశంలో వెల్లడించారు. భారతదేశ పట్టణాభివృద్ధిలో ADB పెట్టుబడుల ఆవశ్యకతను, ప్రయోజనాల్ని మంత్రి నొక్కి చెప్పారు. దీనికి ఏడీబీ ఛైర్మన్ సంతోషం వ్యక్తం చేశారు. రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS)లో భారతదేశం సాధించిన వృద్ధికి కందా అభినందనలు తెలిపారు. 100 భారతీయ నగరాల్లో నీరు, పారిశుధ్యం, వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా వీరి సమావేశంలో చర్చకు వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!

Read Latest Telangana News and National News

Updated Date - May 31 , 2025 | 08:19 AM