Udit Narayan: ఇంట్లో అగ్నిప్రమాదం.. షాక్‌లో గాయకుడు
ABN, Publish Date - Jan 07 , 2025 | 08:59 PM
Udit Narayan: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్.. ఊహించని పరిణామం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ముంబై, జనవరి 07: ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు పురస్కార గ్రహీత ఉదిత్ నారాయణ్ నివాసంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయన నివాసంలోని గృహోపకరణాలన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు కానీ.. ఉదిత్ నారాయణ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఈ ప్రమాద ఘటన కారణంగా ఉదిత్ నారాయణ్ తీవ్ర షాక్‌కు గురైనట్లు సమాచారం. ముంబై.. అందేరిలో శాస్త్రి నగర్‌లోని స్కైపాన్ బిల్డింగ్స్‌లో ఉదిత్ నారాయణ్ నివసిస్తున్నారు.
సదరు బెల్డింగ్‌లో సోమవారం రాత్రి 11వ ఫ్లోర్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ఫ్లోర్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులతోపాటు స్కైపాన్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి, అలాగే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఇక ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో గాయకుడు ఉదిత్ నారాయణ్.. స్కైపాన్ బిల్డింగ్‌లోని 9వ ఫ్లోర్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. అలాగే బాలీవుడ్‌లో మరో గాయకుడు షాన్ నివసిస్తున్న బిల్డింగ్‌లో సైతం ఇదే తరహాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు గాయపడలేదని చిత్ర పరిశ్రమ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.
Also Read: కేటీఆర్‌పై వ్యంగ్య బాణాలు సంధించిన పొంగులేటి
Also Read: మోదీ పర్యటన.. ఎంపీ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
Also Read: కేటీఆర్ కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు
Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్ .. ఎలా ఉండబోతోంది?
Also Read: భూకంపం: 95 మంది మృతి
అయితే దేశ రాజధాని ముంబైలో నిత్యం ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంపై బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. గాయకుడు ఉదిత్ నారాయణ్ నివాసంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదీకాక.. ఉదిత్ నారాయణ్.. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో సైతం పలు గీతాలు ఆలపించారు. అవి కూడా సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
For National News And Telugu News
Updated Date - Jan 07 , 2025 | 09:02 PM