ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Zipline Video Footage: జిప్‌లైన్‌పై రైడ్‌ చేస్తూ సెల్ఫీ వీడియో

ABN, Publish Date - Apr 29 , 2025 | 05:24 AM

పహల్గాములో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది, ఇందులో పర్యాటకులు జిప్‌లైన్‌పై ఉన్నప్పుడు ఉగ్రదాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇదే సమయంలో, ముష్కరులు చైనా మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించి భారత సరిహద్దు ఆవల ఉన్నవారితో సమాచారం పంచుకున్నారు.

తెలియకుండానే ఉగ్రదాడిని రికార్డ్‌ చేసిన పర్యాటకుడు!

పహల్గాం, ఏప్రిల్‌ 28: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఓ కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ పర్యాటకుడు జిప్‌లైన్‌పై రైడ్‌ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. జిప్‌లైన్‌పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుండగా, దిగువన ఉన్న వ్యక్తుల కేకలు, తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి. అలాగే ఉగ్రవాదుల దాడికి భయపడి పర్యాటకులు పరుగెడుతున్న దృశ్యాలు, దాడిలో గాయపడిన ఓ వ్యక్తి నేలకొరిగిన దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే తన చెవులు కప్పి ఉంచడం వల్ల దిగువన జరుగుతున్న విషయాలేవీ ఆ పర్యాటకుడు గుర్తించలేదు. కాగా, రైడ్‌కు ముందు జిప్‌లైన్‌ ఆపరేటర్‌ వ్యవహార శైలి తీరుపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పహల్గాం ఉగ్రదాడికి ముష్కరులు చైనా మెసేజింగ్‌ యాప్‌లను వాడినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ యాప్‌ల సాయంతోనే ఉగ్రవాదులు భారత సరిహద్దుకు ఆవల ఉన్నవారితో సమచారాన్ని పంచుకున్నాయని, ఆదేశాలు అందుకున్నాయని వివరించాయి. ఈ యాప్‌లను 2020లో గల్వాన్‌ ఘర్షణ అనంతరం భారత్‌ నిషేధించిందని పేర్కొన్నాయి. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇండియా నిషేధం విధించిన చైనా మెసేజింగ్‌ యాప్‌ల్లో వీచాట్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్‌ ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:24 AM