ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahua Moitra: వివాహ బంధంలోకి మహువా మొయిత్రా

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:26 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను ఈనెల 3న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఆమె పెళ్లి చేసుకున్నారు.

  • వరుడు బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రా

  • ఈ నెల 3న జర్మనీలో జరిగిన పెళ్లి

న్యూఢిల్లీ, జూన్‌ 5: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను ఈనెల 3న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఆమె పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఒక ఆంగ్ల టీవీ చానల్‌ తాజాగా వెలుగులోకి తెచ్చింది. సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ చేయిచేయి పట్టుకొని సంతోషంగా నడిచి వస్తున్న ఈ ఫొటోలో మహువా భారీగా బంగారు ఆభరణాలు కూడా ధరించి ఉండటంతో వీరు పెళ్లి చేసుకున్నట్టు అర్థమవుతోంది. అలాగే, పెళ్లి జరిగినట్టు మహువా గురువారం నిర్ధారించారు.


తామిద్దరూ కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను ఆమె ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దీంతో ప్రజలు సోషల్‌ మీడియా ద్వారా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 1974 అక్టోబరు 12న అసోంలో జన్మించిన మహువా ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2010లో ఆమె తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. కాగా, 1959 అక్టోబరు 23న ఒడిసాలోని పూరీలో జన్మించిన పినాకి మిశ్రా సీనియర్‌ న్యాయవాది కూడా. తొలుత కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆ తర్వాత బీజేడీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, మహువా గతంలో డానిష్‌ ఫైనాన్షియర్‌ లార్స్‌ బ్రార్సన్‌ను పెళ్లి చేసుకున్నారు. పినాకి మిశ్రాకు కూడా గతంలో వివాహమైంది.

Updated Date - Jun 06 , 2025 | 04:26 AM