ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
ABN, Publish Date - May 16 , 2025 | 05:11 AM
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.
శ్రీనగర్/ ట్రాల్, మే 15: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లా అవంతిపొరాలోని ట్రాల్ పట్టణానికి సమీపంలోని నాదిర్ గ్రామంలో ఉగ్రవాదులున్నారని నిఘా వర్గాలకు ఉప్పందింది. దీంతో ఉగ్రవాదులు దాక్కున్న ఆ గ్రామాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి.
నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతాబలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగినట్లు డ్రోన్ చిత్రీకరించిన వీడియోలో కనిపిస్తోంది. దీంతో భద్రతాదళాలు ఆత్మరక్షణార్థం జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వారిని జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులు అసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యవార్ అహ్మద్ భట్‌గా గుర్తించిన భద్రతా దళాలు.. ఆ ముగ్గురూ పుల్వామా జిల్లా వాసులేనని తెలిపాయి.
Updated Date - May 16 , 2025 | 05:11 AM