BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, Publish Date - Jan 22 , 2025 | 11:15 AM
తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం రుణంగా పొందిన రూ.10 లక్షల కోట్లు తిరిగి చెల్లించేందుకు మరికొన్నేళ్లు పడుతోందని, డీఎంకే ప్రభుత్వం కనీస అవసరాలకు ఈ రుణాన్ని వెచ్చించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) వ్యాఖ్యానించారు.
రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల రుణభారం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
చెన్నై: తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం రుణంగా పొందిన రూ.10 లక్షల కోట్లు తిరిగి చెల్లించేందుకు మరికొన్నేళ్లు పడుతోందని, డీఎంకే ప్రభుత్వం కనీస అవసరాలకు ఈ రుణాన్ని వెచ్చించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) వ్యాఖ్యానించారు. అన్నామలై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వ నిర్వాహణ లోపంవల్ల రాష్ట్ర ప్రజలపై రుణ భారం పెరుగుతూ వస్తోందని ఆరోపించారు.
ఈ వార్తను కూడా చదవండి: High Court: మాజీ మంత్రికి హైకోర్టు నోటీసు
రూ.3లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రభుత్వం రూ.60వేలకోట్ల నుంచి రూ.70వేలకోట్ల వరకు ఏ పథకాల కోసం ఖర్చు పెడుతోందో స్పష్టతలేదన్నారు. ఆరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎంకే విద్యా, ఉద్యోగ రంగంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులను ఉన్నతస్థాయికి ఏ విధంగా తీసుకువెళ్లిందో ఆదిద్రావిడ సంక్షేమ శాఖామంత్రి మదివేందన్ సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు.
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే
ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Read Latest Telangana News and National News
Updated Date - Jan 22 , 2025 | 11:15 AM