ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Himalayas : కాలుష్యం అవుతున్న హిమాలయాల మేఘాలు..

ABN, Publish Date - Aug 04 , 2025 | 09:25 PM

ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన హిమాలయాలు తన ఉనికిని కోల్పోతున్నాయి. సహజసిద్ధంగా.. నిర్మలంగా ఉండే హిమాలయాలు ఇప్పుడు కాలుష్యం బారిన పడుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన హిమాలయాలు తన ఉనికిని కోల్పోతున్నాయి. సహజసిద్ధంగా.. నిర్మలంగా ఉండే హిమాలయాలు ఇప్పుడు కాలుష్యం బారిన పడుతున్నాయి. సస్యశ్యామలంగా ఉండే హిమాలయా మేఘాలు విషపూరిత లోహాలను మోసుకెళ్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మహాబలేశ్వర్ పైన ఉన్న మేఘాలలో డార్జిలింగ్ కంటే రెండు రెట్లు ఎక్కువ లోహ సాంద్రతలను కలిగి ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

కాలుష్యం అవుతున్నాయి..

ఒకప్పుడు అత్యంత స్వచ్ఛమైన తాగునీటిని అందించేవిగా ఉన్న హిమాలయ మేఘాలు నిశ్శబ్దంగా విషపూరిత భారీ లోహాలను మోసుకెళ్తున్నాయి. దీని వల్ల పిల్లలకు క్యాన్సర్ కారక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. తూర్పు హిమాలయాలపై ఉన్న మేఘాలు పశ్చిమ కనుమల కంటే 1.5 రెట్లు ఎక్కువ కాలుష్య స్థాయిలను కలిగి ఉన్నాయన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వర్షాకాలం ప్రారంభంలోనే..

పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలలో ఈ వర్షాకాలం ప్రారంభంలోనే మేఘాలలో కాడ్మియం(Cd), రాగి (Cu), జింక్ (Zn) వంటి విషపూరిత లోహాలు గణనీయమైన స్థాయిలో ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. హిమాలయాల మేఘాలను డార్జిలింగ్ లోని మేఘాలతో పరిశోధన జరిపినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పారు. తక్కువ స్థాయిలో ఉన్న మేఘాలు కూడా భారీ విషపూరిత లోహలను తరిలిస్తున్నాయని పేర్కొన్నారు.

పిల్లలపై ప్రభావం..

భారతదేశంలో పెద్దల కంటే పిల్లలకు 30 శాతం ఇటువంటి విషపూరిత లోహాల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తూర్పు హిమాలయాల మేఘాలో కరిగిన Cr ను పీల్చడం వల్ల క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. దీనితో పాటు పిల్లల్లో కండరాల బలహీనత కూడా ఏర్పాడే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఇప్పడు అక్కడి ప్రజలకు ఆరోగ్య ప్రమాదం పెరిగిందని మనం చెప్పుకోవచ్చు.

కాలుష్యానికి కారణం..

హిమాలయాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాడ్మియం(Cd), రాగి (Cu), జింక్ (Zn) స్థాయిలు పెరగడానికి పర్వత ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే హానికరమైన వాయువులు కారణమని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇది ఇలానే కొనసాగితే పూర్తి స్థాయిలో హిమాలయాలు కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు.

భారీ విషపూరిత లోహాలకు మేఘాలు రవాణా మాధ్యమాలుగా పనిచేస్తాయి. అయితే.. వాటి నుంచి వెలువడే గాలిని పీల్చడం, ఎత్తైన ప్రాంతాలలో వర్షపు నీటిని వినియోగించడం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అక్కడి ప్రజలు మాస్క్‌లను ధరించి ఎప్పటికప్పుడు ఆరోగ్య ప్రమాణాలపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, చైనా, పాకిస్తాన్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలతో పోలిస్తే భారతీయ మేఘాలు ఇంకా తక్కువ కాలుష్యంతోనే ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. కానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ఇదే పరిస్థితి కొనసాగిస్తే భారత దేశ మేఘాలు పూర్తిగా కాలుష్యం అయ్యే ప్రమాదం లేకపోలేదు.

Updated Date - Aug 04 , 2025 | 09:44 PM