Supreme Court: ముందుల ధరల పెరుగుదల.. సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 04 , 2025 | 06:41 PM
Supreme Court: సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార మందులు అందుబాటు ధరల్లో లభించడం కష్టమై పోయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పౌరులు ఈ రకమైన దోపిడికి గురి కాకుండా రక్షించేందుకు తగిన మార్గ దర్శకాలను రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ, మార్చి 05: అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే.. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహాకంగా మారిందని విమర్శించింది. ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రోగులు, వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో మందులు కొనుగోలు చేయిస్తున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమ పార్మసీల నుంచి మందులు కొనుగోలు చేయాలంటూ.. రోగులను బలవంతం చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
Also Read: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. దీంతో రోగులు దోపిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. అయితే పిటిషనర్ వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. రోగులకు సూచించిన ఔషధం వేరే పార్మసీలో స్వల్ప ధరకు లభ్యమవుతుంటే.. దానిని తమ పార్మసీలోనే కొనుగోలు చేయాలంటూ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులపై ఒత్తిడి తీసుకు రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం.. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్
Also Read: లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారు
సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార మందులు అందుబాటు ధరల్లో లభించడం కష్టమై పోయిందంటూ వ్యాఖ్యానించింది. పౌరులు ఈ రకమైన దోపిడికి గురి కాకుండా రక్షించేందుకు తగిన మార్గ దర్శకాలను రూపొందించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే గతంలో ఇదే అంశంపై పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వాటికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు స్పందించాయి.
Also Read: ఏటీఎంలో చోరీ యత్నం.. బిగ్ ట్విస్ట్
ఆ క్రమంలో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ధరల నియంత్రణపైనే తాము ఆధారపడతామని ఆయా రాష్ట్రాలు స్పష్టం చేశాయి. అత్యవసర మందులు అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చూసేందుకు వాటి ధరలు నిర్ణయించినట్లు తెలిపాయి. అయితే ఆసుపత్రిలోనే మందులు కొనుగోలు చేయాలనే ఒత్తిడి ఏమి లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
For National News And Telugu News
Updated Date - Mar 04 , 2025 | 06:43 PM