ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tata Group: టాటా గ్రూప్‌ చరిత్రలో అత్యంత చీకటి రోజు

ABN, Publish Date - Jun 14 , 2025 | 04:42 AM

టాటా గ్రూప్‌ చరిత్రలో అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగిన జూన్‌ 12 అత్యంత చీకటి రోజని ఆ సంస్థ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు.

  • ఉద్యోగులకు చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ లేఖ

అహ్మదాబాద్‌, జూన్‌ 13: టాటా గ్రూప్‌ చరిత్రలో అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగిన జూన్‌ 12 అత్యంత చీకటి రోజని ఆ సంస్థ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన టాటా గ్రూప్‌ సంస్థ ఉద్యోగులకు లేఖ రాశారు. ఘటనతో షాక్‌కు గురయ్యామని, విషాదంలో మునిగిపోయామన్నారు. ఒకరిని కోల్పోతేనే ఎంతో బాధ ఉంటుందని ఒకేసారి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యూకే, అమెరికా నుంచి అహ్మదాబాద్‌కు దర్యాప్తు బృందాలు చేరుకున్నాయని ఆయన తెలిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని, సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. వాస్తవాలు బయటకు వస్తేనే ఘటన ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు. ప్రయాణికుల భద్రతే తొలి లక్ష్యంగా ఎయిర్‌ ఇండియా సంస్థను చేపట్టామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 04:42 AM