ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna waters: కృష్ణా జలాల కోసం ఆంధ్రాకు తమిళనాడు అధికారులు..

ABN, Publish Date - Mar 04 , 2025 | 11:50 AM

నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా కృష్ణ జలాల నిర్వహణ రుసుము చెల్లించేందుకు రాష్ట్ర అధికారులు త్వరలో ఆంధ్ర రాష్ట్రం వెళ్లనున్నారు. రాజధాని నగరం చెన్నై ప్రజల దాహార్తి తీర్చేలా నదీజలాల ఒప్పందంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కండలేరు డ్యాం నుంచి ప్రతి ఏడాది 12 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది.

చెన్నై: నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా కృష్ణ జలాల(Krishna waters:) నిర్వహణ రుసుము చెల్లించేందుకు రాష్ట్ర అధికారులు త్వరలో ఆంధ్ర రాష్ట్రం వెళ్లనున్నారు. రాజధాని నగరం చెన్నై(Chennai) ప్రజల దాహార్తి తీర్చేలా నదీజలాల ఒప్పందంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కండలేరు డ్యాం(Kandaleru Dam) నుంచి ప్రతి ఏడాది 12 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఒప్పందం మేరకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: తేల్చిచెప్పేశారు.. ‘కంబళ’ను ఆపే ప్రసక్తే లేదు..


2023-24వ సంవత్సరంలో 2.41 టీఎంసీలు, 2024-25వ సంవత్సరంలో 2 టీఎంసీల నీరు మాత్రమే విడుదల చేశారు. ఈ నీటిని పొందేందుకు, ప్రతి ఏడాది నిర్వహణ రుసుముగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 4 టీఎంసీల నీరు వదలాల్సి ఉండగా, ఇప్పటివరకు 2 టీఎంసీలు మాత్రమే అందింది.


మిగిలిన 2 టీఎంసీల నీరు పొందితే, నగర ప్రజలకు వేసవిలో అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా చేసే అవకాశముంది. అందువల్ల, ఆ నీటిని పొందేందుకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టింది. ఆ శాఖ అధికారుల బృందం త్వరలో ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లనుంది. ఆ సమయంలో, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన నిర్వహణ రుసుము చెల్లించనున్నట్లు చెన్నై మండల జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 11:50 AM