Supreme Court: ఆమె ఉగ్రవాది కాదు.. ఎవర్నీ హత్య చేయలేదు
ABN, Publish Date - May 22 , 2025 | 05:04 AM
తప్పుడు రిజర్వేషన్ పత్రాల కేసులో పూజా ఖేడ్కర్‌కు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆమె తీవ్రమైన నేరస్తురాలు కాదని, ఇప్పటికే ఉద్యోగ అవకాశాలను కోల్పోయిందని కోర్టు పేర్కొంది.
పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 21: మాజీ ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు సుప్రీం కోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన తీవ్రమైన నేరం ఏమిటని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ‘ఆమె డ్రగ్స్ వ్యాపారి కాదు.. ఉగ్రవాది కాదు. హత్యకు పాల్పడలేదు. ఆమెకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె అన్నీ కోల్పోయింది. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం లేద’ని పేర్కొంది. ఐఏఎస్ ట్రైనింగ్‌కు ఎంపికైన పూజ యూపీఎస్సీ పరీక్షల్లో ఓబీసీ, దివ్యాంగుల కోటా కోసం తప్పుడు పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో ఆమెపై ఫోర్జరీ కేసు నమోదయ్యాయి. దీంతో ఆమె ట్రెయినింగ్ కూడా రద్దయింది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:32 AM