Wakf Amendment Act 2025: వక్ఫ్‌పై మధ్యంతర ఉత్తర్వులను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ABN, Publish Date - May 23 , 2025 | 04:56 AM
వక్ఫ్ సవరణ చట్టం-2025పై దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. వక్ఫ్ ఆస్తుల గుర్తింపును కోల్పోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరుతున్నారు.
న్యూఢిల్లీ, మే 22: వక్ఫ్ సవరణ చట్టం-2025లోని మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న వినతులపై గురువారం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వాయుదా వేసింది. కోర్టులు వక్ఫ్ భూములుగా గుర్తించిన ఆస్తులను (వక్ఫ్ బై కోర్ట్స్), వినియోగదారుల చేతిలో ఉన్న వక్ఫ్ ఆస్తులను (వక్ఫ్ బై యూజర్), పత్రాలు ద్వారా దఖలుపడ్డ వక్ఫ్ ఆస్తులను (వక్ఫ్ బై డీడ్)లను డీ-నోటిఫై చేయకూడదని కోరుతూ పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఒకవేళ డీ-నోటిఫై చేస్తే వక్ఫ్ ఆస్తులన్న గుర్తింపును అవి కోల్పోతాయి. ప్రభుత్వం వీటిని డీ-నోటిఫై చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వరుసగా మూడురోజుల పాటు విచారణ జరిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 04:56 AM