Supreme Court: ఉపాధ్యాయుడు మందలించడం.. ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:46 AM
విద్యార్థిని ఆత్మహత్యకు ఉపాధ్యాయుడి మందలింపు కారణం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ ఉపాధ్యాయుడిపై కేసును కొట్టేసింది.
న్యూఢిల్లీ, జూన్ 1 : పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు తమిళనాడులో ఒక ఉపాధ్యాయుడిపై నమోదైన కేసును కొట్టివేసింది. ఓ పాఠశాల, హాస్టల్ ఇన్‌చార్జిగా ఉన్న ఉపాధ్యాయుడు మరో విద్యార్థి ఫిర్యాదు మేరకు బాధిత విద్యార్థిని మందలించాడు. ఈ ఘటన అనంతరం అతడు గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఉపాధ్యాయుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలను కొట్టివేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల బెంచ్ మద్రాసు హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 05:47 AM