ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cold Start Doctrine: చిన్న అణ్వస్త్రాలు

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:30 AM

భారత్‌ కోల్డ్‌ స్టార్ట్‌ వ్యూహాన్ని ఎదుర్కొనడానికి పాకిస్థాన్‌ చిన్న అణ్వాయుధాల వినియోగాన్ని వ్యూహంగా వేసుకుంది. కానీ అలాంటి చిన్న అణుప్రయోగాలకూ భారత్‌ ఘాటు ప్రతీకారం చూపుతుందంటూ 2013లోనే శ్యాం శరణ్‌ స్పష్టం చేశారు.

కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌ను ఎదుర్కోవడానికి పాక్‌ కూడా కొన్ని సైనిక వ్యూహాలను రూపొందించింది. వీటిలో ప్రధానమైనది టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌. అంటే చిన్న అణ్వాయుధాలు! హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన బాంబుల్ని స్ట్రాటజిక్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ అంటారు. అంటే భారీ అణ్వాయుధాలు. అవి లక్షల సంఖ్యలో ప్రజల్ని చంపుతాయి. నగరాల్ని నేలమట్టం చేస్తాయి. కానీ టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ చిన్నగా ఉండి తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. శత్రు దేశం తాలూకు సైనిక లక్ష్యాలపై వీటిని ప్రయోగిస్తారు. ఇవి నాలుగైదు వేల మంది సైనికుల్ని చంపగలిగే శక్తిని కలిగి ఉంటాయి. భారత సైన్యం ఒకవేళ పాక్‌లోకి పెద్దసంఖ్యలో చొచ్చుకువెళితే భారత నగరాలపై భారీ అణ్వస్త్రాలను ప్రయోగించకుండా మన సైన్యంపై ఈ చిన్న అణ్వస్త్రాలను ప్రయోగించి నిరోధించాలని పాక్‌ ఉద్దేశం. ఈ చిన్న అణ్వస్త్రాలు మేం వేసినా భారత్‌ భారీ అణ్వస్త్రాలను తమపై వేయబోదనేది దాయాది లెక్క! తద్వారా భారత్‌ రూపొందించిన కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌ను దెబ్బతీయాలన్నది వారి వ్యూహం.

ఇందుకోసం నాసర్‌ అనే స్వల్ప శ్రేణి క్షిపణుల్ని పాక్‌ రూపొందించి సిద్ధంగా ఉంచుకుంది. కానీ పాక్‌ పన్నిన ఈ వ్యూహం చెల్లదని భారత్‌ అప్పట్లోనే స్పష్టం చేసింది. ‘‘మీరు ప్రయోగించే అణ్వస్త్రం చిన్నదా, పెద్దదా అనేది మాకు అనవసరం. మీరు దానికి టాక్టికల్‌ అని పేరు పెడతారా, స్ట్రాటజిక్‌ అని పేరు పెడతారా అనేది మేం పట్టించుకోం. భారత్‌పై మీరు చిన్న అణ్వస్త్రం ప్రయోగించినా సరే దానికి భారత్‌ చేసే అణు ప్రతీకారం పెద్ద స్థాయిలోనే ఉంటుంది’’ అని 2013లో అప్పటి జాతీయ భద్రతా సలహామండలి చైర్మన్‌ శ్యాం శరణ్‌ స్పష్టం చేశారు. అందువల్ల భారత్‌పై చిన్న అణ్వస్త్రాల్ని వేయాలన్నా పాక్‌ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోక తప్పని పరిస్థితి ఉండవచ్చు.


భారత నౌకాదళ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విమానవాహక యుద్ధ నౌక.. దానిపై ఉన్న రష్యన్‌ మిగ్‌ 29కే యుద్ధ విమానాలు ప్రస్తుతం దీనిని అరేబియా సముద్రంలో పాక్‌కు దగ్గరగా మోహరించినట్లు వార్తలు వచ్చాయి

Updated Date - Apr 30 , 2025 | 04:30 AM