ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stalin: సీట్లు తగ్గుతాయని మోదీయే చెప్పారు

ABN, Publish Date - Mar 23 , 2025 | 03:25 AM

పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గవని ఇటీవల కోయంబత్తూరు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. కానీ, 2023లో తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

పునర్విభజనతో వంద సీట్లు తగ్గుతాయని తెలంగాణలో అన్నారు

తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ

చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను బట్టి పునర్విభజనతో లోక్‌సభ సీట్లు తగ్గటం ఖాయమనే విషయం తేటతెల్లమవుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. ‘‘పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గవని ఇటీవల కోయంబత్తూరు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. కానీ, 2023లో తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కులాలవారీ జనగణన జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు 100 సీట్లను కోల్పోతాయని, ఇందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు సమ్మతిస్తారా? అంటూ నాడు ఆయన ప్రశ్నించారు’’ అని గుర్తు చేశారు.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని, అయితే, ఆ ప్రక్రియ సర్వజనామోదంగా, న్యాయసమ్మతంగా ఉండాలని డిమాండ్‌ చేశారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించేలా ఈ ప్రక్రియ ఉండకూడదన్నదే తమ అభిమతమని పునరుద్ఘాటించారు. సమావేశ ప్రారంభంలో స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఆహ్వానాన్ని అంగీకరించి ఇంతమంది రాజకీయ పార్టీల నేతలు సమావేశానికి విచ్చేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అందరం సమావేశమైనట్లు భారత జాతికి ఎలుగెత్తి చాటుతున్నాం.


ఈ సమావేశం చారిత్రక ఘట్టంగా నిలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను (543) యథాతథంగా ఉంచి పునర్విభజన జరిపితే తమిళనాడులో ఎనిమిది ఎంపీ సీట్లు తగ్గుతాయని, ఒకవేళ ఎంపీల సంఖ్యను (ఎనిమిది వందలకుపైగా) పెంచినా 12 ఎంపీ సీట్లను కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజనకు అనుకూలంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో, కేంద్రాన్ని ఒప్పించడంలో జేఏసీ పాత్ర కీలకమని తెలిపారు. పునర్విభజన ముప్పు రాష్ట్రాల నెత్తిపై కత్తిలా వేలాడుతోందని కేరళ సీఎం విజయన్‌ అన్నారు. అనంతరం, జేఏసీ సమావేశ వివరాలను డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాకు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు రావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎవరూ రాలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వైసీపీ నుండి ప్రతినిధులెవరూ రాకపోయినా, ఈ సమస్యపై ఆ పార్టీ నేత ప్రధానికి లేఖ రాశారని వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ త్వరలో స్టాలిన్‌ను కలుస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 03:25 AM