ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shubhanshu Shukla: ఢిల్లీలో శుభాన్షు శుక్లాకు ఘన స్వాగతం

ABN, Publish Date - Aug 18 , 2025 | 03:59 AM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా రికార్డు సృష్టించిన శుభాంశు శుక్లా.. ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి తిరిగొచ్చారు. శుక్లాతోపాటు బ్యాకప్‌ వ్యోమగామిగా అమెరికాకు వెళ్లిన ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ కూడా భారత్‌కు చేరుకున్నారు.

  • నేడు ప్రధాని మోదీని కలవనున్న శుక్లా

  • తర్వాత స్వస్థలం లఖ్‌నవూకు పయనం

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా రికార్డు సృష్టించిన శుభాంశు శుక్లా.. ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి తిరిగొచ్చారు. శుక్లాతోపాటు బ్యాకప్‌ వ్యోమగామిగా అమెరికాకు వెళ్లిన ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ కూడా భారత్‌కు చేరుకున్నారు. వీరికి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ ఘన స్వాగతం పలికారు. యాక్సియం-4 మిషన్‌ శిక్షణలో భాగంగా శుక్లా గతేడాది అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏడాది తర్వాత తొలిసారిగా భారత్‌కు చేరుకోవడంతో శుక్లాకు స్వాగతం పలకడానికి ఆయన భార్య కామ్నా, కుమారుడు కియాష్‌ కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు త్రివర్ణ పతాకాలు ఊపుతూ, డ్రమ్స్‌ వాయిస్తూ స్వాగతం పలికారు.

శుభాంశు శుక్లా విజయానికి గుర్తుగా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత మొదటి వ్యోమగామి-2047 నాటికి వికసిత్‌ భారత్‌ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర’ అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చకు ప్రతిపాదించింది. భారత్‌కు చేరుకున్న శుక్లా ముందుగా సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు వెళ్లనున్నారు. ఈ నెల 22-23వ తేదీల్లో జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన తిరిగి దేశ రాజధానికి చేరుకుంటారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ ఏడాది జూన్‌ 25న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన యాక్సియం-4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. విజయవంతంగా ఐఎ్‌సఎ్‌సలోకి చేరిన ఈ నలుగురు వ్యోమగాములు అక్కడ పలు ప్రయోగాలు పూర్తిచేసుకుని ఈ ఏడాది జూలై 15న భూమిపైకి చేరుకున్నారు.

Updated Date - Aug 18 , 2025 | 03:59 AM