ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India defense strategy: అమెరికా రష్యా చైనా స్పందనేమిటి?

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:48 AM

ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా ఘర్షణల నేపథ్యంలో ఆయుధాల సరఫరా అంతరాయం కలిగింది. భారత్‌ పూర్తిస్థాయి యుద్ధానికి దూరంగా ఉండి తక్కువ నష్టంతో పాక్‌కు గుణపాఠం చెప్పే వ్యూహం వెతుకుతోంది.

రిత్రను పరిశీలిస్తే భారత్‌కు రష్యా.... పాకిస్థాన్‌కు అమెరికా సన్నిహితంగా ఉంటూ వచ్చాయి. ఇటీవలి కాలంలో అమెరికా భారత్‌కు కొంత చేరువైంది. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలు కూడా పెరిగాయి. అయితే పహల్గాం ఉగ్రదాడిని అమెరికా ఖండించినప్పటికీ, భారత్‌-పాక్‌ మధ్య తాజా పరిణామాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. భారత్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధంలో తలమునకలై ఉంది. భారత్‌ ఉపయోగించే ఆయుధాల్లో అత్యధికం రష్యా నుంచి కొనుగోలు చేసినవే. వాటిలో ఉపయోగించే క్షిపణులు, మందుగుండు, స్పేర్‌పార్టుల్లో చాలాభాగం రష్యా నుంచి రావాల్సిందే. కానీ ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆ సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇంకోవైపు మన మరో శత్రు దేశమైన చైనా పాక్‌కు మద్దతు ప్రకటించింది. భారత్‌ దాడి చేసే పక్షంలో తాము పాక్‌కు అండగా ఉంటామని బాహాటంగానే చెప్పింది. ఇటీవలి కాలంలో పాక్‌ తన ఆయుధాల్లో అత్యధికం చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనాతో కలిసి జేఎఫ్‌ 17 యుద్ధ విమానాల్ని తయారు చేసింది. భారత రాఫెల్‌ విమానాలకు సమాధానంగా చైనా నుంచి పాక్‌ జే 10సీ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది.


ఇంకోవైపు టర్కీ కూడా పాక్‌కు విమానాలు, ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఫ్రాన్స్‌ మాత్రం పూర్తిగా భారత్‌ వెన్నంటే ఉంది. గతంలో కార్గిల్‌ యుద్ధ సమయంలో కూడా ఫ్రాన్స్‌ భారత్‌కు మందుగుండు సామగ్రిని సరఫరా చేసి ఆదుకుంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధాలకు అనువుగా లేవు. టారిఫ్‌ల యుద్ధం, ఆర్థిక మాంద్యం వల్ల చాలాదేశాలు ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. శతఘ్నుల నుంచి ప్రయోగించే 155ఎంఎం తూటాలు అన్ని యుద్ధాల్లో ఎంతో కీలకమైనవి. ఒకవైపు ఉక్రెయిన్‌ యుద్ధం, మరోవైపు గాజా యుద్ధం జరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆ తూటాలకు కరువొచ్చి పడింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న భారత్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. చైనాకు పోటీగా ఆర్థికంగా బలోపేతం కావాలని, సూపర్‌ పవర్‌గా ఆవిర్భవించాలని ఆశిస్తున్న భారత్‌ ఇప్పుడు పాక్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల భారత వ్యూహకర్తలు అన్ని ఆప్షన్లనూ పరిశీలించి మనకు తక్కువ నష్టం కలిగే రీతిలో పాక్‌కు ఏ విధంగా బుద్ధి చెప్పగలం అనే వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 04:48 AM