Pahalgam: చిక్కినట్లే చిక్కి.. తప్పించుకుంటున్నారు
ABN, Publish Date - Apr 29 , 2025 | 05:19 AM
పహల్గాములో ఉగ్రవాదులు భద్రత బలగాలకు చిక్కినా, పారిపోయారు. ఎన్ఐఏ సహా భద్రతా బలగాలు వీరిని ట్రాక్ చేయడం కొనసాగిస్తున్నాయి, వారు పర్యాటకుల సెల్‌ఫోన్లను దోచి వాటిని కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు.
పహల్గాం ఉగ్రవాదులను నాలుగు సార్లు గుర్తించిన భద్రత బలగాలు
జమ్మూ, ఏప్రిల్ 28: పహల్గాం ఉగ్రవాదులు భద్రత బలగాలకు చిక్కినట్లే చిక్కి.. తప్పించుకుంటున్నారు. ఉగ్రదాడిలో నలుగురు పాల్గొన్నట్లు ఇప్పటికే తేలింది. వీరిలో ఇద్దరు పాకిస్థానీలు. స్థానికులు అందిస్తున్న సమాచారం, నిఘా వర్గాల సూచనలతో భద్రత బలగాలు వీరి కోసం గాలిస్తుండగా.. నాలుగు సార్లు పక్కా లొకేషన్‌ను ట్రాక్ చేశారు. అయితే.. బలగాలు అక్కడికి వెళ్లేలోపు.. ఉగ్రవాదులు అక్కడి నుంచి దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ‘‘ఉగ్రవాదులను తొలుత పహల్గాం సమీపంలోని తెహస్లీ వద్ద గుర్తించాం. భద్రత బలగాలు అక్కడికి చేరుకునేలోపు.. వారు అడవుల్లోకి పారిపోయారు. కల్గాం అడవుల్లో వారి ఉనికి ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కొకెర్నాగ్‌లో, అక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులున్నట్లు గుర్తించినా, వారు పారిపోయారు’’ అని ఓ సైనికాధికారి జాతీయ మీడియాకు తెలిపారు. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కూడా ఉగ్రవాదులను ట్రాక్ చేస్తోంది. పహల్గాం దాడి సమయంలో ఉగ్రవాదులు ఇద్దరు పర్యాటకుల సెల్‌ఫోన్లను తస్కరించారు. కమ్యూనికేషన్ కోసం వాటిని ఉపయోగించే అవకాశాలున్నాయి. దీంతో.. ఆ ఫోన్లపైనా నిగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News
Updated Date - Apr 29 , 2025 | 05:19 AM