Jammu Kashmir terrorism: కశ్మీర్లో చురుగ్గా14 మంది ఉగ్రవాదులు
ABN, Publish Date - Apr 27 , 2025 | 01:02 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో 14 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరు పాకిస్థాన్ ఉగ్రవాదులకు కీలక సమాచారం, సౌకర్యాలను అందిస్తున్నారని తెలిపాయి.
శ్రీనగర్, ఏప్రిల్ 26: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం 14 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని నిఘావర్గాలు గుర్తించాయి. వీరంతా 20 నుంచి 40 ఏళ్లలోపువారే. వీరంతా పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్థానిక కీలక సమాచారం ఇవ్వడంతో పాటు వారికి ఆశ్రయం కల్పించడం, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్
Updated Date - Apr 27 , 2025 | 01:02 AM