Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసు.. పోలీసుల మరో ట్విస్ట్
ABN, Publish Date - Jan 17 , 2025 | 03:34 PM
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వాడు వీడు కాదంటూ.. తాజాగా ఈ కేసుపై పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసిన ఈ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గంటకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా ముంబై పోలీసులు మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వాడు వీడు కాదని.. అసలు నిందితుడు తమ అదుపులో లేడంటూ బాంబు పేల్చారు. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేన్నారు.
సంబంధమే లేదు!
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఉదయం కథనాలు వచ్చాయి. దీనిపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. పొద్దున బాంద్రా పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన వ్యక్తికి సైఫ్ మీద దాడితో సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. నిందితుడు తమ అదుపులో ఉన్నాడని వస్తున్న పుకార్లలో నిజం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 17 , 2025 | 03:46 PM