PM Modi: ప్రధాని మోదీతో మోహన్ భాగవత్ భేటీ
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:33 AM
పహల్గాం దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పహల్గాం దాడి మీద చర్చలు జరిగాయనీ, ఆ దాడిని ఆరెస్సెస్ దేశ సమగ్రతపై చేసిన దాడిగా ఖండించిందని సమాచారం.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రధాని నరేంద్ర మోదీతో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మంగళవారం భేటీ అయ్యారు. పహల్గాం దుర్ఘటన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆ దుర్ఘటనపైనే ఇరువురు నేతలు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, త్రి దళాల అధిపతులతో సమావేశమయిన అనంతరం భాగవత్..ప్రధానితో చర్చలు జరిపారు. హోం మంత్రి అమిత్ షాతోనూ మోదీ సమావేశమయ్యారు. కాగా, పహల్గాం దాడిని ఆరెస్సెస్ ఖండించింది. ఇది దేశ సమగ్రతపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి..
Pakistan: భారత 'గూఢచారి డ్రోన్'ను కూల్చేశామన్న పాక్
Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..
Viral News: పాకిస్తాన్ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..
Updated Date - Apr 30 , 2025 | 05:33 AM