ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Religious Reservations Karnataka politics: ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్నే మార్చాలంటారా?

ABN, Publish Date - Mar 25 , 2025 | 03:47 AM

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మతపరమైన రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ మార్పులు చేయాలని వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ బీజేపీ లోక్‌సభ, రాజ్యసభలో ఆందోళన చేపట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

చర్యలు తీసుకుంటారో లేదో కాంగ్రెస్‌ స్పష్టం చేయాలన్న కేంద్ర మంత్రి రిజిజు

పార్లమెంటు ఉభయసభల్లో రచ్చ

న్యూఢిల్లీ/బెంగళూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభ అట్టుడికిపోయాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు సోమవారం ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేశారని, అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4ు రిజర్వేషన్‌ కల్పిస్తూ సిద్దరామయ్య సర్కారు చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మతపరమైన రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. అంబేడ్కర్‌ ఫొటో పట్టుకొని తిరగడంతో పాటు రాజ్యాంగ ప్రతిని జేబులో పెట్టుకొని తిరిగే కాంగ్రెస్‌ నేతలు ముస్లింలకు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చాలంటారా? దీనిపై ఆ పార్టీ వివరణ ఇవ్వాల్సిందేనని, అతనిపై చర్యలు తీసుకుంటారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలిపారు. అదే సమయంలో రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా మాట్లాడుతూ..

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో ముస్లింల రిజర్వేషన్‌ కోసం చేసిన చట్టాలను, నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, భారత్‌ను ముక్కలు చేయాలని చూస్తున్నదే బీజేపీ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని డీకే అనలేదన్నారు. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసును మరుగునపడేసేందుకే బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నడ్డా.. ముస్లింలకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ కేవలం కర్ణాటకలోనే కాదని, తెలంగాణలోనూ చట్టం చేసిందని ఆరోపించారు. ముస్లింలను ఓబీసీలుగా పేర్కొంటూ దొడ్డిదారిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తోందని విమర్శించారు. ఇక రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జైరాం రమేశ్‌ కేంద్ర మంత్రి రిజిజుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న డీకే

డీకే శివకుమార్‌పై ఆరోపణలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఈ విషయమై వివరాలు తెలుసుకోవాలని పార్టీ అగ్రనేత చిదంబరాన్ని ఆదేశించింది. ఆయన డీకే శివకుమార్‌కు ఫోన్‌ చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని డీకే వివరణ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుల కుట్ర అని చెప్పినట్లు సమాచారం. కోర్టు తీర్పులకు అనుగుణంగా సవరణలు చేసే వీలుందనే చెప్పానని, రాజ్యాంగాన్ని మార్చాలని అనలేదని చెప్పినట్లు తెలిసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:47 AM