ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt Jobs: టెన్త్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వేలల్లో ఖాళీలు

ABN, Publish Date - Jan 27 , 2025 | 04:34 PM

Central Govt Jobs: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రైల్వే శాఖలో వేలాది పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు అర్హత 10వ తరగతి, ఐటీఐ అని స్పష్టం చేసింది. అంతేకాదు..ఈ ఉదోగ్యానికి ఎంపికైతే తొలి మాసం నుంచి రూ.35 వేలు జీతం అందుకోవచ్చు.

రైల్వేలో ఉద్యోగాల కోసం వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతోన్నాయి. ఈ సారి లెవల్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. టెన్త్, ఐటీఐ, అప్రెంటిస్.. వీటిలో ఏ విద్య అర్హత ఉన్న ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికిల్ టెస్టులతో నియామకాలుంటాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు.. మొదటి నెల నుంచి రూ. 35,000 వేతనం అందుకో వచ్చును.

ఈ అర్హతలు ఉన్న వారు.. ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్ట్ (ఆర్ఆర్‌బీ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తోంది. అయితే అభ్యర్థులు ఏదో ఒక ఆర్ఆర్‌బీని ఎంపిక చేసుకోని.. దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను తెలుగులో సైతం రాసుకోవచ్చు.

మొత్తం 14 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్ అండ్ టీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంటుల్లో ఉన్నాయి. ఎంపికైన వారికి అసిస్టెంట్స్, ట్రాక్ మెన్, పాయింట్స్‌మెన్ హోదాలు కేటాయించనున్నారు. వీరికి మూల వేతనం రూ. 18,000, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులతో సుమారు రూ. 35,000 మొదటి నెల నుంచి అందుతాయి. ఇక సర్వీసు, విద్యార్హతలు, అంతర్గత పరీక్షలతో భవిష్యత్తులో పదోన్నతలు పొందుతారు.


ఆన్‌లైన్ పరీక్ష..

ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానికి 1/3 వంతు మార్కును తగ్గిస్తారు. వంద మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షను గంటన్నర వ్యవధి పాటు నిర్వహిస్తారు. అంటే 90 నిమిషాలు. జనరల్ సైన్స్ 25 మార్కులు, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో 20 అబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.


అర్హత..

అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్‌లు 40, ఓబీసీలు (ఎస్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీలు 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం కొందరిని ఎంపిక చేస్తారు. అనంతరం వారికి దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు.


ముఖ్య వివరాలు..

పోస్టు: లెవెల్-1 ఖాళీలు 32,438

విద్యార్హత: పదో తరగతి/ ఐటీఐ లేదా తత్సమానం/ ఎన్‌సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్(ఎన్ఏసీ).

వయస్సు: 2025, జనవరి 1వ తేదీకి నాటికి 18 నుంచి 36 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్)కు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరి ప్రకారం 10 నుంచి 15 ఏళ్లు గరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22వ తేదీ దరఖాస్తు ఫీజు.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ. 250. పరీక్షకు హాజరయ్యే వారికి బ్యాంకు ఛార్జీలు మినహాయించి, మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు రూ. 500. పరీక్షకు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి ఇచ్చేస్తారు.

పరీక్షలు: తేదీలు తర్వాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్: http://www.rrbapply.gov.in/#/auth/landing

For National News And Telugu News

Updated Date - Jan 27 , 2025 | 05:25 PM