ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: పేదలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడం బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌‌కు నచ్చదు: రాహుల్‌

ABN, Publish Date - Jun 21 , 2025 | 05:40 AM

దేశంలోని పేద పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడం బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలకు ఇష్టం లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. ఎందుకంటే పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వారితో సమానంగా మారడం కాషాయ నేతలకు నచ్చదని విమర్శించారు.

న్యూఢిల్లీ, జూన్‌ 20: దేశంలోని పేద పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడం బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలకు ఇష్టం లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. ఎందుకంటే పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వారితో సమానంగా మారడం కాషాయ నేతలకు నచ్చదని విమర్శించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రతిరోజూ ఇంగ్లిష్‌ మాట్లడవద్దని, హిందీలోనే మాట్లాడమని చెబుతుంటారని కానీ ఆ పార్టీ నేతల పిల్లలు మాత్రం చదువుకోవడానికి విదేశాలకు వెళ్తుంటారని, దీని వెనక ఉద్దేశం ఏమిటని రాహుల్‌ ప్రశ్నించారు. దేశంలో ఇంగ్లిష్‌ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఎక్స్‌ వేదికగా శుక్రవారం రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు.

ఇంగ్లిష్‌ నేర్చుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదని.. సాధికారతకు చిహ్నమని అన్నారు. దేశంలోని ప్రతి భాషకు దాని సొంత ఆత్మ, సంస్కృతి, జ్ఞానసంపద ఉన్నాయని.. వాటన్నిటిని మనం గౌరవించాలని పేర్కొన్నారు. ప్రపంచ వేదికలపై పోటీపడాలనుకునే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం ఎంతో కీలకమని, మాతృభాషతో పాటు ఇంగ్లిష్‌ తప్పకుండా నేర్చుకోవాలని రాహుల్‌ గాంధీ సూచించారు.

Updated Date - Jun 21 , 2025 | 05:40 AM