Narendra Modi: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన ప్రధాని మోదీ..
ABN, Publish Date - Feb 05 , 2025 | 11:09 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ మేళాను సందర్శించారు. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత మోదీ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపై పవిత్ర స్నానం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. దీనికి ముందు ప్రధాని మోదీ గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థలానికి చేరుకోవడానికి సీఎం యోగితో కలిసి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు. మోదీ సంగం ఘాట్‌కు చేరుకున్న వెంటనే, మోదీ మోదీ అంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీనికి ముందు కూడా
మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్‌లో రెండున్నర గంటలు బస చేస్తారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఈరోజు బడే హనుమాన్ జీ, అక్షయవత్‌లను కూడా సందర్శించవచ్చని చెబుతున్నారు. స్థానిక నివాసితులు, మహా కుంభమేళాకు వచ్చే భక్తులు ప్రధాన మంత్రి మోదీ రాక పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ముందు కూడా ప్రధాని మోదీ 6 సంవత్సరాల క్రితం సంగంలో స్నానం చేశారు. 2019 కుంభమేళాలో ప్రధాని మోదీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగారు. అదే సమయంలో మహా కుంభమేళా ప్రారంభానికి ముందు, డిసెంబర్ 13న, ప్రధాని మోదీ కూడా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి అనేక పథకాలను ప్రారంభించారు.
ఈరోజు ప్రత్యేకం..
హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 5కు చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును భీష్మాష్టమి అని కూడా అంటారు. ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తపస్సు, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు చేస్తే మంచిదని చెబుతుంటారు. ఈ రోజున అలాంటివి చేసేవారి కోరికలన్నీ నెరవేరుతాయని అనేక మంది భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం మహాభారత సమయంలో భీష్మ పితామహుడు బాణాల మంచం మీద పడుకుని సూర్యుడు ఉత్తరం, శుక్ల పక్షం వైపు కదిలేందుకు వేచి ఉన్నారు. ఆ క్రమంలో మాఘ మాసం ఎనిమిదో రోజున శ్రీకృష్ణుని సన్నిధిలో తన ప్రాణాలను త్యాగం చేశారు. దీని ఫలితంగా ఆయనకు మోక్షం లభించింది. అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Delhi Assembly Elections 2025: ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బూత్‌లకు బెలూన్లు ఏర్పాటు..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 10 , 2025 | 07:55 PM