Prime Minister Modi: అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నాం
ABN, Publish Date - Apr 28 , 2025 | 05:06 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలు అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. అంతరిక్ష స్టార్ట్‌ప్‌లు 325కు చేరుకున్నాయనీ, ప్రైవేటు భాగస్వామ్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్‌కు ఆయన నివాళులర్పించారు.
దేశంలో 325కు పైగా అంతరిక్ష స్టార్ట్‌పలు..మన్‌కీ బాత్‌లో ప్రధాని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచం మొత్తం మీద అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేస్తోందన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని తెలిపారు. ఆదివారం ఆయన మన్‌కీ బాత్ 121వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంతరిక్ష స్టార్ట్‌పల రంగంలో యువత సరికొత్త మైలురాళ్లను చేరుకుంటున్నారన్నారు. దశాబ్దం కిందట దేశంలో ఒకే ఒక్క అంతరిక్ష స్టార్టప్ ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 325కి చేరిందని తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం బాగా పెరిగిందన్నారు. రెండు రోజుల కింద మరణించిన ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్‌కు ప్రధాని నివాళులర్పించారు.
ఆయన మృతితో దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందన్నారు. సైన్స్, విద్య, అంతరిక్ష కార్యక్రమాల్లో దేశం అత్యున్నత శిఖరాలకు చేరుకోవడంలో ఆయన భాగస్వామ్యం ఎనలేనిదని.. కసూర్తి రంగన్ సేవలను దేశం ఎన్నటికీ మరువలేదని చెప్పారు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఏప్రిల్‌లోనే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించామని.. ఐదు దశాబ్దాల ప్రయాణంలో అంతరిక్ష రంగంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో చూస్తున్నామని తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అభివృద్ధి చేసిన సాచెట్ యాప్ గురించి వివరిస్తూ... తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడడం, సునామీ, కార్చిచ్చులు, హిమపాతం, ఈదురుగాలులు వంటి ప్రకృతి విపత్తులపై ప్రజలను ముందుగానే హెచ్చరించేందుకు సాచెట్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు..
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 28 , 2025 | 05:06 AM