PM Modi: ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రయోజనాలు అందాలి
ABN, Publish Date - May 26 , 2025 | 02:23 AM
దేశ అభివృద్ధిలో అణగారిన వర్గాలను భాగస్వామ్యంగా మార్చేందుకు కులగణన కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సీఎంల సమావేశంలో డబుల్ ఇంజన్ పాలన ఫలితాలను ప్రజలకు చేర్చాలని మోదీ పిలుపునిచ్చారు.
ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీలో మోదీ
న్యూఢిల్లీ, మే 25(ఆంధ్రజ్యోతి): దేశంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నమునాకు అనుగుణంగా దేశంలో కులగణన జరుగుతుందని తెలిపారు. సమాజంలో అభివృద్ధి ఫలాలు చేరని వారిని, అణగారిన వారిని అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు త్వరలో చేపట్టబోయే కులగణనతో ముందడుగు పడుతుందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో మోదీ అధ్యక్షతన ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. 20 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో మన సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించి, పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పడాన్ని సమావేశం అభినందించింది. దేశంలో చరిత్రాత్మక రీతిలో కులగణన చేపట్టాలని మోదీ నిర్ణయించడాన్నీ కొనియాడింది. ఈ మేరకు సమావేశం తీర్మానాలను ఆమోదించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 02:23 AM