ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modi On GST: దేశ ప్రజలకు మోదీ గుడ్ న్యూస్

ABN, Publish Date - Aug 15 , 2025 | 09:45 AM

Modi: దేశ ప్రజలకు జీఎస్టీ తగ్గింపుపై శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. దీపావళి లోపు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు.

ఢిల్లీ, ఆగస్టు 15: పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. దేశ యువతకు మోదీ వరాలు కురిపించారు. ఇవాళ్టి నుంచి పీఎం వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకం అమల్లోకి తెస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. పీఎం వికసిత్‌ భారత్‌ యోజనతో 3.5 కోట్లమంది యువతకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే యువతకు రూ.15 వేలు ఇస్తామని అన్నారు.

ఈసారి డబుల్‌ దీపావళి వేడుకలు...

ఈసారి డబుల్‌ దీపావళి వేడుకలు అని అన్నారు ప్రధాని మోదీ. సంస్కరణల కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హైపవర్‌ కమిటీ ఏర్పాటుతో GST సంస్కరణలు తెస్తామని.. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. మనం సృష్టించిన UPI ప్రపంచంలో మనశక్తిని చాటుతోందని అన్నారు. భారతదేశ సంపద బయటకు ఎందుకెళ్లాలని.. ప్రతిరంగంలో మనమే అప్లికేషన్లు తయారుచేసుకుందాం అని పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఫార్మా కేపిటల్‌గా భారత్‌కు పేరుందని అన్నారు. వ్యాక్సిన్ల తయారీలోనూ మనం సత్తా చాటుతున్నట్లు చెప్పారు. ఇది ఐటీ యుగం.. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నుంచి AI వరకు అన్నీ మనవే కావాలని ప్రధాని మోదీ అన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 11:25 AM